Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: April 22, 2020, 11:04 PM IST
RRR మోషన్ పోస్టర్ (RRR motion poster)
RRR సినిమా కోసం ప్రస్తుతం దేశవ్యాప్తంగా అభిమానులు వేచి చూస్తున్నారు. రాజమౌళి ఈ సినిమాను ఎలా తెరకెక్కిస్తున్నాడో అంటూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమా కథ ఏమై ఉంటుందో అని అంతా ఆశగా చూస్తున్నారు కూడా. ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇలాంటి సందర్భంలో సినిమా గురించి చిన్న అప్ డేట్ తెలిసినా కూడా పండగ చేసుకుంటున్నారంతా. ఇక ఇప్పుడు లాక్ డౌన్ సందర్భంగా షూటింగ్ ఆగిపోయింది. అయినా కూడా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం జరుగుతుందని.. అది ఆగలేదని గుడ్ న్యూస్ చెప్పాడు రాజమౌళి.

రామ్ చరణ్, అజయ్ దేవ్ గణ్, ఎన్టీఆర్ Photo : Twitter
ఈ క్రమంలోనే ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా కథ కూడా రివీల్ చేసాడు రాజమౌళి. స్వతంత్య్రానికి పూర్వం అల్లూరి, కొమరం భీం గురించి అంతా చదువుకున్నామని.. అయితే వాళ్ల గురించి తెలియని విషయాలను ఊహాజనితంగా తాము చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పాడు రాజమౌళి. 1919-22 మధ్య ప్రాంతంలో ఒకేసారి ఇంట్లోంచి వెళ్లిపోయిన ఈ ఇద్దరు నాయకులు ఆ మూడు నాలుగేళ్లు ఏం చేసారనేది చరిత్రలో లేదని.. వచ్చిన తర్వాత వాళ్లెలా స్వాంతంత్య్రం కోసం పోరాడారో చరిత్ర చెబుతుందని చెప్పాడు దర్శక ధీరుడు.

రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ Photo: Twitter
ఇక ఇందులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాత్రల గురించి కూడా చెప్పాడు ఈయన. ఇది స్వాతంత్య్రం కోసం పోరాడే సినిమా కాదని క్లారిటీ ఇచ్చాడు ఈయన. స్నేహం నేఫథ్యంలో సాగే కథ అంటూ షాక్ ఇచ్చాడు రాజమౌళి. ఇన్నాళ్లూ ఇదేదో యాక్షన్ సినిమా.. స్వాంతంత్య్రం కాంక్ష్య ఉన్న దేశభక్తుల కథ అనుకున్నారంతా. కానీ కాదని కన్ఫర్మ్ చేసాడు.

రాజమౌళి Photo : Twitter
ఇది పూర్తిగా ఫ్రెండ్ షిప్ నేఫథ్యంలో తెరకెక్కుతుందని.. చరణ్, ఎన్టీఆర్ మధ్య స్నేహమే RRR కథ అంటున్నాడు జక్కన్న. సినిమా అనుకున్నట్లుగానే జనవరి 8న విడుదలవుతుందని చెప్పాడు రాజమౌళి. ఇప్పటికే దాదాపు షూటింగ్ అంతా అయిపోయిందని.. ఇంకాస్త మిగిలింది కూడా లాక్ డౌన్ తర్వాత పూర్తి చేస్తామని చెప్పాడు ఈయన. డివివి దానయ్య ఈ సినిమాను 300 కోట్లతో నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అజయ్ దేవ్గన్ ఈ చిత్రంలో చరణ్ తండ్రి పాత్రలో నటిస్తున్నాడు.
Published by:
Praveen Kumar Vadla
First published:
April 22, 2020, 11:04 PM IST