Home /News /movies /

RRR MOVIE REVIEW RAJAMOULI JR NTR RAM CHARAN AJAY DEVGN ALIA BHATT PK VISUAL WONDER TA

RRR
RRR
3/5
రిలీజ్ తేదీ:25/03/2022
దర్శకుడు : S S Rajamouli
సంగీతం : M M Keeravani
నటీనటులు : Jr NTR Ram Charan Ajay Devgn Alia Bhatt Olivia Moris
సినిమా శైలి : Periodic Action Drama
సినిమా నిడివి : 3 Hrs

RRR Movie Review : ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ.. సిల్వర్ స్క్రీన్ పై రాజమౌళి మ్యాజిక్ పని చేసిందా..

ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ (Twitter/Photo)

ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ (Twitter/Photo)

RRR Movie Review | బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ముఖ్యపాత్రల్లో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్నో అంచనాల మధ్య ప్యాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10 వేలకు స్క్రీన్స్‌లో విడుదలైంది. మరి ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)మూవీతో రాజమౌళి సిల్వర్ స్క్రీన్ పై తన మార్క్ మ్యాజిక్ చూపెట్టాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

ఇంకా చదవండి ...
రివ్యూ : ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)

నటీనటులు : జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,అజయ్ దేవ్‌గణ్,ఆలియా భట్, ఒలివియా మోరీస్, శ్రియ, సముద్రఖని,రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ,రాజీవ్ కనకాల, ఛత్రపతి శేఖర్ తదితరులు..

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

కథ : కే.వి.విజయేంద్ర ప్రసాద్

ఎడిటర్ : ఎ.శేఖర్ ప్రసాద్

సినిమాటోగ్రఫీ : కే.కే.సెంథిల్ కుమార్

మాటలు : సాయి మాధవ్ బుర్రా

నిర్మాణం : డీవీవీ ఎంటర్టైన్మెంట్స్

నిర్మాత : డీవీవీ దానయ్య

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : ఎస్.ఎస్.రాజమౌళి

బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ముఖ్యపాత్రల్లో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్నో అంచనాల మధ్య ప్యాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10 వేలకు స్క్రీన్స్‌లో విడుదలైంది. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో భారీ అంచనాలతో మధ్య ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)మూవీ విడుదలైంది. మరి ఈ మూవీతో  రాజమౌళి సిల్వర్ స్క్రీన్ పై తన మార్క్ మ్యాజిక్ చూపెట్టాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ:

రామరాజు (రామ్ చరణ్) బ్రిటిష్ ప్రభుత్వంలో పోలీస్ అధికారిగా పని చేస్తుంటాడు. మరోవైపు భీమ్ (జూనియర్ ఎన్టీఆర్) గోండు జాతి బిడ్డ. లాల జాతి నుంచి ఒక చిన్న పిల్లలను బ్రిటిష్వాళ్లు తీసుకొస్తారు. ఆ పాపను తీసుకురావడానికి వేషం మార్చుకుని బీమ్ బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరికి వస్తాడు. ఆయన్ని పట్టుకోవడానికి రామరాజును నియమిస్తారు బ్రిటీష్ అధికారులు. ఈ నేపథ్యంలోనే ఒకరి గురించి ఒకరికి తెలియకుండా స్నేహితులు అయిపోతారు రామ్ భీమ్. ఆ తర్వాత ఏం జరిగింది.. ఇద్దరి లక్ష్యం ఏంటి అనేది కథ..

కథనం:

బ్రాండ్ ఎంత గొప్పగా ఉన్న ఏదో ఒక టైంలో కచ్చితంగా రిపేర్ వస్తుంది.. బహుశా రాజమౌళి విషయంలో వచ్చిన రిపేర్ RRR కావచ్చు. పూర్తిగా పాడైపోయింది అని చెప్పడం లేదు.. రిపేర్ మాత్రమే. రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోయింది.. జూనియర్ ఎన్టీఆర్ పులి తో ఫైట్ చేసే సన్నివేశం ఎక్స్ట్రాడినరీ.. మతిపోయే ఇంటర్వల్ బ్లాక్.. అద్భుతమైన క్లైమాక్స్.. ఇలా ముక్కలు ముక్కలుగా బాగుంది కానీ.. మొత్తంగా కలిపి చూస్తే మాత్రం ఏదో అసంతృప్తి కనిపించింది. వీటన్నింటినీ కలిపే ఎమోషన్ అనే గీత సరిగా రాలేదు. రాజమౌళి కెరీర్ మొత్తంలో చాలా మందికి అలా అనిపించిన సినిమా ఇది మాత్రమే. ఇద్దరు స్టార్ హీరోలు ఉండడం మూలానో.. లేదంటే ఎలా ఉన్నా ఆ స్టార్స్ చూసుకుంటారన్న ధీమానో.. తన బ్రాండ్ మీద నమ్మకమో తెలియదు కానీ.. మొదటిసారి రాజమౌళి కూడా తడబడినట్లు అనిపించింది. రాజమౌళి సినిమా అంటే ముందుగా గుర్తొచ్చేది ఎమోషన్.. RRRలో ఎందుకో అది ఎక్కువగా వర్కవుట్ అవ్వలేదు అనిపించింది. కొన్ని సన్నివేశాలు ఎప్పట్లాగే చాలా అద్భుతంగా చిత్రీకరించాడు రాజమౌళి. తన గమ్యం కోసం ఇష్టం లేని పని చేస్తూ.. లోపల కోపం, బాధ పెట్టుకున్న పాత్రలో రామ్ చరణ్ జీవించాడు. మొదట్లో కాస్త అమాయకంగా ఉండి.. కొమరం భీమ్ గా గాండ్రించే గోండు బిడ్డ పాత్రలో యంగ్ టైగర్ విజృంభించాడు. వీళ్ళద్దరినీ ఒకే స్క్రీన్ మీద కలిపి చూడడం అద్భుతంగా అనిపించింది.. దానికి తగ్గట్టు కథా బలం కూడా ఉండుంటే మరింత అదిరిపోయేది.
రొటీన్ కథను కూడా బలమైన సన్నివేశాలతో నింపే రాజమౌళి.. ఇద్దరు స్టార్ హీరోలను కలిపి చూపించడంలో ఆ బలమైన ఎమోషన్ మిస్ అయినట్టు అనిపించింది. ఇటు ఎన్టీఆర్.. అటు చరణ్.. ఇద్దరూ ఎవరికీ ఎవరూ తక్కువ కాదు అన్నట్టు రెచ్చిపోయారు. అజయ్ దేవగన్ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉంది.. అలియా భట్ కూడా అంతే. టెక్నికల్ పరంగా మరోసారి విజువల్ గ్రాండియర్ చూపించాడు రాజమౌళి. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం రిపీట్ మోడ్ లో వినిపించింది.

ప్లస్ పాయింట్స్ 

ఎన్టీఆర్, రామ్  చరణ్‌ల యాక్షన్

ఫస్ట్ హాఫ్ సాంగ్

ఇంటర్వెల్ ముందు ఎన్టీఆర్ ఫైట్

మైనస్ పాయింట్స్

కీరవాణి సంగీతం

సెకాండాప్ బోరింగ్

స్లో నేరేషన్, ఎమోషన్ మిస్సింగ్

రేటింగ్ : 3/5

చివరి మాట.. RRR.. యాక్షన్ అదుర్స్.. సోల్ మిస్సింగ్..
Published by:Kiran Kumar Thanjavur
First published:

రేటింగ్

కథ:
3/5
స్క్రీన్ ప్లే:
3/5
దర్శకత్వం:
3/5
సంగీతం:
2.5/5

Tags: Ajay Devgn, Alia Bhatt, Bollywood news, Jr ntr, Rajamouli, Ram Charan, RRR, RRR Movie Review, Tollywood

తదుపరి వార్తలు