news18-telugu
Updated: August 24, 2019, 6:23 PM IST
ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ (ఫ్యాన్ మేడ్ పోస్టర్ కమ్ ట్విట్టర్ ఫోటోస్)
తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమలోనే క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కుతోంది ఆర్ఆర్ఆర్. పైగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. పైగా రాజమౌళి దర్శకుడు కావడం.. బాహుబలి సిరీస్ తర్వాత సినిమా కావడంతో అంచనాలు ఆకాశం హద్దుగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా ఎమ్మా రాబర్ట్స్‌ను తీసుకుంటున్నారు. ఈ విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొమరం భీమ్ లుక్‌ను అక్టోబర్ 22న కొమరం భీమ్ పుట్టినరోజున విడుదల చేసే అవకాశం ఉన్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. చరిత్రలో జరిగిన రెండు కల్పిత పాత్రల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను వచ్చే యేడాది జూలై 30న విడుదల చేయనున్నట్టు సమాచారం.

rrr సినిమా ప్రెస్ మీట్
ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్ నటిస్తున్నాడు. మరోవైపు ఈ సినిమాలో ప్రభాస్ వాయిస్ ఇవ్వనున్నట్టు సమాచారం. ఆయన వాయిస్ ఓవర్‌తోనే ఈ సినిమాలోని అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను పరిచయం చేయనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
August 24, 2019, 6:23 PM IST