RRR: ఫోటో అదిరింది.. చరణ్, ఎన్టీఆర్‌తో అజయ్ దేవ్‌గన్..

RRR Movie: RRR షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్ర సెట్‌లోకి అజయ్ దేవ్‌గన్ వచ్చి కూడా మూడు నాలుగు రోజులు అవుతుంది. అల్లూరి సీతారామరాజు పాత్రకు స్వాతంత్ర్య కాంక్ష్య రగిలించేలా అజయ్ దేవ్‌గన్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: January 29, 2020, 7:04 PM IST
RRR: ఫోటో అదిరింది.. చరణ్, ఎన్టీఆర్‌తో అజయ్ దేవ్‌గన్..
RRR సినిమా లొకేషన్ ఫోటో (RRR movie shooting pic)
  • Share this:
అబ్బబ్బా.. ఏం కాంబినేషన్ సామీ.. అదిరిపోయింది కదా అనిపిస్తుంది ఈ ఫోటో చూస్తుంటే. నిజంగానే రెండు కళ్లు చాలడం లేదన్నట్లు.. చూస్తుంటేనే దిష్టి తగులుతుందేమో అన్నట్లుగా ఈ ఫోటోను విడుదల చేసారు. ప్రస్తుతం RRR షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఈ చిత్ర సెట్‌లోకి అజయ్ దేవ్‌గన్ వచ్చి కూడా మూడు నాలుగు రోజులు అవుతుంది. అయితే ఇప్పటి వరకు హీరోలతో మాత్రం ఈయన కాంబినేషన్ సెట్ కాలేదు. అయితే తొలిరోజు రామ్ చరణ్‌తో కలిసి పని చేసాడు అజయ్. దాంతో సినిమా యూనిట్ అంతా కలిసి ఆయనకు ఘనస్వాగతం పలికారు. ముఖ్యంగా రామ్ చరణ్, అజయ్ మధ్య వచ్చే సన్నివేశాలు అదిరిపోతాయని.. ఇందులో చరణ్ తండ్రిగా అజయ్ దేవ్‌గన్ నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది.

RRR సినిమా లొకేషన్ ఫోటో (RRR movie shooting pic)
RRR సినిమా లొకేషన్ ఫోటో (RRR movie shooting pic)


అల్లూరి సీతారామరాజు పాత్రకు స్వాతంత్ర్య కాంక్ష్య రగిలించేలా అజయ్ దేవ్‌గన్ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతానికి చరణ్ చిన్నప్పటి సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. ఇందులో భాగంగానే చరణ్, ఎన్టీఆర్ కూడా సెట్‌కు వచ్చారు. అక్కడే రాజమౌళి కూడా ఎలాగూ ఉంటాడు. దాంతో అజయ్, చరణ్, రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఫోటోకు పోజులిచ్చారు. మా సినిమాలోకి ఘనస్వాగతం అజయ్ గారూ అంటూ ట్వీట్ చేసాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ ఫోటో చూసిన తర్వాత రెండు కళ్లు సరిపోవడం లేదంటున్నారు ఫ్యాన్స్.


ఇక షూటింగ్ అయితే అనుకున్న దానికంటే వేగంగానే పూర్తి చేస్తున్నాడు రాజమౌళి. అయితే జులై 30న విడుదలవుతుందా లేదా అనేది మాత్రం సస్పెన్స్. దీనికి సమాధానం తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రంలో అజయ్ ఇండో బ్రిటీష్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా RRR కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు అన్ని ఇండస్ట్రీల అభిమానులు. 300 కోట్లతో దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.
First published: January 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు