RRR మూవీకి నటులు కావలెను... రాజమౌళి పేరుతో పోస్టులు

దర్శకుడు రాజమౌళి పేరుతో కొందరు దండగులు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు.

news18-telugu
Updated: September 1, 2019, 3:31 PM IST
RRR మూవీకి నటులు కావలెను... రాజమౌళి పేరుతో పోస్టులు
RRR సినిమా ప్రెస్ మీట్లో ఎన్టీఆర్,రామ్ చరణ్,రాజమౌళి
  • Share this:
సినిమాల్లో అవకాశం ఇస్తామంటే ఎవ్వరైనా ఎగిరి గంతేస్తారు. ఇక రాజమౌళి సినిమాలో చాన్సంటే పండగ చేసుకుంటారు. అది కూడా రాంచరణ్, ఎన్టీఆర్ వంటి స్టార్లు నటిస్తున్న RRR మూవీలో పాత్ర ఇస్తామంటే...! అలాంటి గోల్డెన్ ఛాన్స్ వస్తే ఎవ్వరూ వదలుకోరు. అలాంటి ఆశావహులు ఎంతో మంది ఉన్నారు. క్రిష్ణానగర్, ఫిలింనగర్, యూసుఫ్‌గూడలో అలాంటి వారు కుప్పలుతెప్పలుగా కనిపిస్తారు. వారి సినిమా పిచ్చిని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. సినిమాల్లో ఛాన్స్‌లు ఇస్తామంటూ డబ్బులు దండుకుంటున్నారు. తాజాగా RRR సినిమా విషయంలోనూ ఇలాంటి తతంగం జరుగుతున్నట్లు తెలిసింది.

దర్శకుడు రాజమౌళి పేరుతో కొందరు దండగులు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. RRR సినిమా కోసం నటీనటులు కావాలంటూ రాజమౌళి పేరిట తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ వెల్లడించింది. అలాంటి తప్పుడు ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని..నిజంగా నూతన నటులు కావాలంటే తమ అధికారిక ఖాతాల ద్వారా మాత్రమే వెల్లడిస్తామని స్పష్టంచేసింది.

కొంద మంది అపరిచితులు రాజమౌళి పేరుతో ఫేస్‌బుక్, ఇన్‌స్టగ్రామ్, ట్విటర్ ఖాతాలు నడుపుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు. RRR సినిమాకు క్యాస్టింగ్ కాల్స్ అంటూ ఫేక్ పోస్టులు పెడుతున్నారు. ఈ విషయం మా దృష్టికి వచ్చింది. ఇలాంటి మోసపూరిత క్యాస్టింగ్ కాల్స్ గురించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
కాగా, రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రాంచరణ్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్, కొమరంభీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. ఇక బాలీవుడ్ నటులు అలీయా భట్, అజయ్ దేవగణ్ కూడా ఈ చిత్రలో నటిస్తున్నారు. రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2020 జూలై 30న విడుదల కానుంది.
Published by: Shiva Kumar Addula
First published: September 1, 2019, 3:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading