RRR కు ఇవి సరిపోతాయా.. రాజమౌళి ఇంకేమైనా ప్లాన్ చేసాడా...

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో 1920ల కాలం నాటి స్టోరీతో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల స్టోరీకి కొంచెం ఫిక్షన్ స్టోరీజోడించి RRR సినిమాను  అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌలి. తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో పలువురు నెటిజన్స్ సూచించిన పేర్లతో కూడిన పోస్టర్స్‌ను రిలీజ్ చేసింది.

Kiran Kumar Thanjavur | news18india
Updated: May 2, 2019, 7:38 AM IST
RRR కు ఇవి సరిపోతాయా.. రాజమౌళి ఇంకేమైనా ప్లాన్ చేసాడా...
RRR
Kiran Kumar Thanjavur | news18india
Updated: May 2, 2019, 7:38 AM IST
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో 1920ల కాలం నాటి స్టోరీతో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల స్టోరీకి కొంచెం ఫిక్షన్ స్టోరీజోడించి RRR సినిమాను  అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌలి. మరోవైపు ఈసినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్.. మరో స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ తరహా పాత్ర  చేయనున్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్ మూవీని దాదాపు మన దేశంలోనే దాదాపు 11 భాషల్లో తెరెక్కిస్తున్నారు. అన్ని భాషల్లో కలిపి RRR అనే టైటిలే పెడుతున్నారు. ఆయా భాషల్లో RRR వచ్చేటట్టు టైటిల్ ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ పక్కన డైసీ ఎడ్గర్ జోన్స్‌ను అనుకున్న ..ఇపుడా ప్లేస్‌లో మరో ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోవాలనే ప్లాన్‌లో ఉన్నారు.  ఈ సినిమాలో ఆర్ఆర్ఆర్ వచ్చేటట్టు మంచి పేరును సూచించాలని ఈ సినిమా నిర్మాణ సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. దానికి అభిమానులను నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి చిత్ర బృందం ఇంకొన్ని మంచి పేర్లు సూచించాలని కోరింది. అంతేకాదు ఇప్పటి వరకు వచ్చిన పేర్లతో ఒక పోస్టర్‌ను డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో 1920ల కాలం నాటి స్టోరీతో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల స్టోరీకి కొంచెం ఫిక్షన్ స్టోరీజోడించి RRR సినిమాను  అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నాడు దర్శక ధీరుడు రాజమౌలి.
RRR డిఫరెంట్ టైటిల్స్‌తో కూడిన పోస్టర్స్


ఈ పోస్టర్‌కు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీకి ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే టైటిల్‌తో పాటు ‘రామ రావణ రాజ్యం’, ‘రంగస్థలంలో రణ రంగం’, ‘రవి చూడని రామరావణ రణ రంగం’, ‘రివల్యూషన్ ఆఫ్ రామరాజు’,‘రైజ్ రోర్ రివోల్ట్’, ‘రాజసం రాక్షసం రావణం’,‘రమ్ రుథిరమ్’,‘రామ రాజ్య రక్షక’, రం రం రుథిరం’,‘రౌద్ర రణ రంగం’ పేర్లు చాలా పేర్లు పోటెత్తుతూనే ఉన్నాయి. ఈ  సినిమాకు అన్ని భాషల్లో కలిపి కామన్‌గా ‘ఆర్ ఆర్ ఆర్’ అనే టైటిల్ ఉంటుంది. ఆయా భాషల్లో క్యాప్షన్ కింద ఒక్కో పేరు ప్రకటిస్తారు. మొత్తానికి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం రాజమౌళి ప్రేక్షకులు సూచించిన పేర్లే పెడతాడా లేకపోతే ఆల్రెడీ ఒక పేరు అనుకోని మీడియాలో సినిమాకు ప్రచారం కల్పించాలనే ఉద్దేశ్యంతో ఇదంతా చేస్తున్నాడా అనేది చాలా మంది నెటిజన్స్ ప్రశ్నించకుంటున్నారు.

First published: May 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...