RRR కోసం ఎన్టీఆర్,రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు నిర్మాత బంపరాఫర్..

RRR | ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో 1920ల కాలం నాటి స్టోరీతో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల స్టోరీకి కొంచెం కాల్పనిక కథ జోడించి ఈసినిమాను అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ చిత్ర యూనిట్ ఈసినిమాకు పర్ఫెక్ట్ పేరు సూచించమని చెబుతున్నారు.

Kiran Kumar Thanjavur | news18-telugu
Updated: March 18, 2019, 2:07 PM IST
RRR కోసం ఎన్టీఆర్,రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు నిర్మాత బంపరాఫర్..
RRR లో ఎన్టీఆర్, రామ్ చరణ్
  • Share this:
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో 1920ల కాలం నాటి స్టోరీతో స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల స్టోరీకి కొంచెం కాల్పనిక కథ జోడించి ఈసినిమాను అత్యంత భారీగా తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు ఈసినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్.. మరో స్వాతంత్య్ర సమరయోధుడు భగత్ సింగ్ తరహా పాత్ర  చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు అన్ని భాషల్లో కలిపి RRR అనే టైటిలే పెడుతున్నారు. తాజాగా ఈ సినిమాలో ఆర్ఆర్ఆర్ వచ్చేటట్టు మంచి పేరును సూచించాలని ఈ సినిమా నిర్మాణ సంస్థ ప్రకటించింది. అంతే కాదు మంచి టైటిల్ సూచించిన వారికి తగిన పారితోషకం కూడా ఇస్తామని కూడా చెప్పింది కూడా. ఇప్పటికే రాజమౌళి మొన్న జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ సినిమా కథ ఇది అని చెప్పాడు. దాని ఆధారంగా ఆర్ఆర్ఆర్ అబ్రివేషన్‌తో రావాలని దానిని స్వయంగా రాజమౌళి పరిశీలిస్తారని చెప్పింది. మరి ఆలస్యం ఎందుకు వెంటనే RRR సినిమాకు తగ్గ పేరును సూచించి తగిన పారితోషకం పొందండి.





First published: March 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు