RRR Bheem Teaser: కొమరం భీమ్ చరిత్ర తెలుసుకో.. రాజమౌళికి ఆదీవాసీల వార్నింగ్..

RRR Bheem Teaser: ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే చాలు కచ్చితంగా దానిపై వివాదాలు చెలరేగుతాయి. అలాంటిది రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడి నుంచి ట్రిపుల్ ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమా వస్తున్నపుడు..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 24, 2020, 10:54 PM IST
RRR Bheem Teaser: కొమరం భీమ్ చరిత్ర తెలుసుకో.. రాజమౌళికి ఆదీవాసీల వార్నింగ్..
ఆర్ఆర్ఆర్ భీమ్ టీజర్ (RRR Bheem teaser)
  • Share this:
ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా విడుదలకు సిద్ధమవుతుందంటే చాలు కచ్చితంగా దానిపై వివాదాలు చెలరేగుతాయి. అలాంటిది రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడి నుంచి ట్రిపుల్ ఆర్ లాంటి భారీ బడ్జెట్ సినిమా వస్తున్నపుడు దాని చుట్టూ ఎలాంటి కాంట్రవర్సీలు రాకుండా ఉండాలంటే జరిగే పని కాదు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తాజాగా విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ భీమ్ టీజర్‌పై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. గిరిజన వీరుడు కొమురం భీంను టీజర్‌లో చూపించిన విధానంపై ఆదిలాబాద్ జిల్లా గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీజర్‌లో కొమరం భీం తలపై టోపి పెట్టి ముస్లీంలా చూపించడంపై ఆదివాసీలు ఫైర్ అవుతున్నారు. తమ ఆరాద్య దైవమైన కొమరం భీంను ఇలా ఇతర పాత్రలో కించపరిచేలా చేసిన సన్నివేశం తమ ఆదివాసీల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ రాజమౌళిపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో కొమరం భీంకు పాలాభిషేకం చేసి RRR సినిమాలో తమను కించ పరిచేలా చేసిన సన్నివేశం తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ భీమ్ టీజర్ (RRR Bheem teaser)
ఆర్ఆర్ఆర్ భీమ్ టీజర్ (RRR Bheem teaser)


RRR సినిమాలో భీం గురించి నిజమైన సన్నివేశాలు చిత్రికరిస్తే బాగుంటుంది కాని ఆయన చరిత్రను తెలుసుకోకుండా ఓ సన్నివేశాన్ని ముస్లీం టోపి పెట్టి కించపరిచేలా చేయడం సరికాదని వాళ్లు ఫైర్ అవుతున్నారు. ఆ సన్నివేశాన్ని తొలగించాలని లేదంటే రాజమౌళిపై చర్యలు తీసుకుంటామని ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని.. వాళ్ల ఇంటి ముందు ధర్నా చేస్తామని వాళ్లు వార్నింగ్ ఇస్తున్నారు. తమ మనోభాలను కించపరిచేలా చేసిన సన్నివేశంపై రాజమౌళిపై SC ST అట్రాసిటి కేసు పెడతామని ఆదివాసీలు స్పష్టం చేశారు. మరి ఇది ఎక్కడ ఎలా ఆగుతుందో చూడాలిక.
Published by: Praveen Kumar Vadla
First published: October 24, 2020, 10:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading