RRR : ఆర్ఆర్ఆర్ రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan) వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ‘రౌద్రం రణం రుధిరం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక్కో రికార్డును స్మాష్ చేస్తూ వెళుతోంది. ఇక ఈ సినిమాలో పాటలు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అందులో ముఖ్యంగా నాటు నాటు సాంగ్ తెలుగుతో పాటు అన్ని భాషల్లో సూపర్ హిట్టైయింది. ఈ పాట ఇప్పటికే తెలుగులో 118 మిలియన్ వ్యూస్‌కు పైగా సాధించింది. తాజాగా ఈ సినిమా నుంచి నాటు నాటు ఫుల్ వీడియో సాంగ్‌ను తెలుగు సహా అన్ని భాషల్లో విడుదల చేశారు. ఈ పాట ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
నాటు నాటు అంటూ ఇరగదీసే స్టెప్పులతో అభిమానులకు కన్నుల పండగ చేయించారు తారక్, చరణ్. ఈ ఇద్దరి డాన్సులు చూస్తుంటే కడుపు నిండిపోయింది అభిమానులకు. ఈ లిరికల్ సాంగ్ చూసిన తర్వాత అభిమానులు గాల్లో గంతులేస్తున్నారు. రౌద్రం రణం రుథిరంలో చరణ్, ఎన్టీఆర్‌తో పాటు అజయ్ దేవ్‌గణ్, అలియా భట్, ఒలివియా మోరీస్ కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ. 1000 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన సంలన విజయం సాధించింది.
Most Celebrated Dance Number of the Decade #RRRMassAnthem full video song from #RRRMovie is out now! 🕺🕺https://t.co/D5pY31FAwI#NaatuNaatu #NaattuKoothu #NaachoNaacho #HalliNaatu #Karinthol
— RRR Movie (@RRRMovie) April 11, 2022
ఈ చిత్రాన్ని 1920 బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో ఇద్దరు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కలిస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రాజమౌళి తెరకెక్కించారు. మరో ముఖ్య పాత్రలో అజయ్ దేవ్‌గణ్ నటించారు. కీరవాణి అందించిన సంగీతం ఈ సినిమాకు స్పెషల్ ఎస్సెట్‌గా నిలిచింది. నాటు నాటు పాటను రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా... తాజాగా కర్ణాటక సహా అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
Minister Roja : రోజా సహా రాష్ట్ర, కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సినీ నటులు వీళ్లే..
ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్టైనా.. ఏదో ఒక ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేకపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం అన్ని ఏరియాల్లో లాభాల్లో రావడం విశేషం. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Rajamouli, Ram Charan, RRR, Tollywood