RRR పై ఎన్టీఆర్ భామ ఒలివియా మోరీస్ ట్వీట్.. నెటింట్లో వైరల్..

ఈ యేడాది టాలీవుడ్‌లో కాదు..కాదు.. దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఒలివియా ఓరిస్ ఆర్ఆర్ఆర్ పై ట్వీట్ నెటింట్లో వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: January 2, 2020, 11:33 AM IST
RRR పై ఎన్టీఆర్ భామ ఒలివియా మోరీస్ ట్వీట్.. నెటింట్లో వైరల్..
జూనియర్ ఎన్టీఆర్ ఒలివియా మోరీస్
  • Share this:
ఈ యేడాది టాలీవుడ్‌లో కాదు..కాదు.. దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్న మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో  రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కిస్తున్నారు. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరు చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు,కొమురం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో.. రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తుండంతో ఈ  సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ 80 శాతం కంప్లీటైంది. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ యాక్ట్ చేస్తోంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఎటువంటి అప్‌డేట్ లేదు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఆర్ఆర్ఆర్‌కు సంబంధించిన ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల పాత పోస్టర్ పై హ్యాపీ న్యూ ఇయర్ 2020 అంటూ ట్వీట్ చేయడం తప్ప మరో అప్‌డేట్ ఏమి ఆర్ఆర్ఆర్ యూనిట్ నుంచి రాకపోవడంతో నందమూరి, మెగా ఫ్యాన్స్ ఉసురు మన్నారు.




ముందుగా ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన డైసీ ఎడ్గార్ జోన్స్‌ను అఫీఫియల్‌గా ప్రకటించారు. కానీ ఆమె తన వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమా చేయలేనట్టు హుందాగా తప్పుకుంది. ఆమె ప్లేస్‌లో హాలీవుడ్‌లో పలు టీవీ షోస్‌లో పాపులర్ అయిన ఒలీవియా మోరిస్‌ను తీసుకున్నారు. ఈ సినిమా ఒప్పుకునే ముందు  వరకు ఆమె ఫాలో అయిన వారి సంఖ్య 300 కూడా లేకుండే. ఇపుడు ఆమెను ఫాలో అయ్యేవారు 22 వేలు దాటింది. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఓ ట్వీట్ చేసింది. హ్యాపీ న్యూ ఇయర్.. 2020 కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నానంటే ఆర్ఆర్ఆర్ హ్యాష్ ట్యాగ్ చేరుస్తూ ట్వీట్ చేసింది. ఇపుడీ ట్వీట్ నెటింట్లో వైరల్ అవుతోంది.
First published: January 2, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు