Ntr - Ram Charan: తార‌క్‌, చెర్రీ ఫ్యాన్స్‌కు పండగే.. బాహుబ‌లిని క్రాస్ చేసిన ‘ఆర్ఆర్ఆర్‌’

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ (RRR release date confirmed Photo : Twitter)

Ntr - Ram Charan: మోస్ట్ అవెయిటెడ్ ప్యాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌’ సీడెడ్ ఏరియా బిజినెస్ విష‌యంలో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింద‌ని స‌మాచారం.

  • Share this:
    భారీ అంచ‌నాల‌తో ప్యాన్ ఇండియా మూవీగా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతోన్న చిత్ర‌మిది. ‘బాహుబ‌లి’ త‌ర్వాత రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా కావ‌డంతో సినిమా కోసం అంద‌రూ ఆతృత‌గా ఎదురుచూస్తున్నారు. సినిమాను ఈ ఏడాదిన ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బిజినెస్ విష‌యంలో భారీ క్రేజ్ నెల‌కొంది. రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం కావ‌డం, టాలీవుడ్ స్టార్ హీరోలైన రామ్‌చ‌ర‌ణ్‌, తార‌క్ న‌టిస్తోన్న చిత్రం కావ‌డంతో సినిమాను భారీ రేటు పెట్టి కొనుగోలు చేయ‌డానికి డిస్ట్రిబ్యూట‌ర్స్ ఆస‌క్తి చూపిస్తున్నారని స‌మాచారం.

    తాజా స‌మాచారం మేర‌కు ‘ఆర్ఆర్ఆర్‌’ సినిమా సీడెడ్ హ‌క్కుల విష‌యంలో రికార్డ్‌ను క్రియేట్ చేసింద‌ట. ప్ర‌ముఖ నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్‌, బ‌ళ్లారి సాయి ట్రిపులార్ సినిమా సీడెడ్ హ‌క్కుల‌ను రూ.45 కోట్ల‌కు కొనుగోలు చేశార‌ట‌. ఈ ఏరియాలో ‘బాహుబ‌లి’ సినిమా రూ.35 కోట్ల‌కు అమ్ముడైన సంగ‌తి తెలిసిందే. ఆ సినిమా కంటే ప‌దికోట్ల రూపాయ‌లు ఎక్కువ‌గా ట్రిపులార్ సినిమా మార్కెటింగ్‌ను పూర్తి చేసుంద‌ని టాక్ వినిపిస్తోంది. బిజినెస్ విష‌యంలో ఓ మెయిన్ ఏరియాలో బాహుబ‌లి రికార్డును ‘ఆర్ఆర్ఆర్‌’ క్రాస్ చేయ‌డంపై తారక్‌, చ‌ర‌ణ్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నార‌ట‌.

    1920 బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతోన్న ఫిక్ష‌న‌ల్ మూవీ ఇది. ఇందులో తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, ఆంధ్ర ప్రాంతానికి చెందిన మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. వీరితో పాటు అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్‌, స‌ముద్ర‌ఖ‌ని, హాలీవుడ్ స్టార్స్ రే స్టీవెన్ స‌న్‌, ఆలిస‌న్ డూడీ, ఒలివియా మోరిస్ త‌దిత‌రులు న‌టిస్తున్న చిత్ర‌మిది. ప్ర‌స్తు‌తం చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది.
    Published by:Anil
    First published: