RRR MOVIE BREAKS BAAHUBALI RECORD IN TAMIL NADU MHN
RRR - Baahubali2: ‘బాహుబలి’కి ‘ఆర్ఆర్ఆర్’ షాక్.. తమిళనాట సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన ట్రిపులార్
RRR movie breaks Baahubali record in Tamil Nadu
RRR - Baahubali2: ఎంటైర్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్ ఇండియా మూవీస్ లిస్టులో ‘ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం)’ ఒకటి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా, బాహుబలి 2ను క్రాస్ చేసింది
ఎంటైర్ ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాన్ ఇండియా మూవీస్ లిస్టులో ‘ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం)’ ఒకటి. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంచనాలకు తగ్గట్టుగానే రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దాదాపు నాలుగు వందల యాబై కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఉన్న క్రేజ్ ప్రకారం ప్రీ రిలీజ్ బిజినెస్ కేక పెట్టిస్తుంది. కేవలం థియేట్రికల్ బిజినెస్ వరకే ఐదు వందల కోట్ల రూపాయలను దాటించాలని రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడట. అందుకు తగినట్లే ఏరియాలకు రేట్స్‌ను ఫిక్స్ చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ‘ఆర్ఆర్ఆర్’ థియేట్రికల్ హక్కులను రూ.50 కోట్లకు కోట్ చేశారు. తమిళ అగ్ర నిర్మాణ సంస్థలు ‘ఆర్ఆర్ఆర్’ డిస్ట్రిబ్యూషన్ హక్కుల కోసం పోటీ పడ్డాయి. లేటెస్ట్ సమాచారం మేరకు ‘ఆర్ఆర్ఆర్’ తమిళనాట థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రూ.42 కోట్లకు దక్కించుకుందని టాక్. బాహుబలి 2 థియేట్రికల్ హక్కులు రూ.37 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ లెక్కన చూస్తే ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా, బాహుబలి2ను క్రాస్ చేసింది.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పుడు సినిమా క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతుంది. దసరా సందర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.
Published by:Anil
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.