RRR: ఆర్ఆర్ఆర్ షూటింగ్‌‌లో రామ్ చరణ్.. చాలా రోజుల తర్వాత సెట్‌లో అడుగు పెట్టిన అల్లూరి సీతారామరాజు..

ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో జాయిన్ అయిన రామ్ చరణ్ (Twitter/Photo)

RRR:  దాదాపు కొన్ని నెలల గ్యాప్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).... ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.

  • Share this:
    RRR:  దాదాపు కొన్ని నెలల గ్యాప్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).... ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) కారణంగా అన్ని రకాల షూటింగ్స్ పోస్ట్ పోన్ అయ్యాయి. అంతేకాదు ఆర్ఆర్ఆర్ షూటింగ్ సందర్భంగా కొంత మంది ఆర్టిస్టులు, టెక్నిషియన్స్ కరోనా బారిన పడటంతో ఆయా నటీనటుల కాంబినేషన్స్‌లో చేయాల్సిన సీన్స్ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను తొలిగించింది. మరోవైపు హీరోలు కూడా షూటింగ్‌లో తిరిగి పాల్గొంటున్నారు. ఇప్పటికే రాజమౌళి.. ఆర్ఆర్ఆర్ షూటింగ్‌ను గండిపేటతో పాటు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చేస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ లేకుండా కొన్ని సీన్స్ పిక్చరైజ్ చేస్తున్నారు.

    ఈ రోజు నుంచి రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. చాలా రోజుల తర్వాత మెగా పవర్ స్టార్ తిరిగి ఆర్ఆర్ఆర్‌ సెట్‌లో అడుగుపెట్టారు. ఈ విషయాన్ని రామ్ చరణ్ హెయిర్ స్టైలిష్ట్ ఆలీమ్ హకీమ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.


    రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్‌గా ’ఆర్ఆర్ఆర్’ (Roudram Ranam Rudhiram) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు తెలుగు ప్రాంతానికి చెందిన చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు.  ఈ సినిమాను కూడా రాజమౌళి పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. పూర్వ జన్మలో స్వాతంత్య్ర పోరాటం కోసం కన్నుమూసిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌లు ఆ తర్వాత జన్మలో ఎలా తమ స్వాతంత్య్ర కాంక్ష నెరవేర్చుకున్నారనేదే ఈ సినిమా స్టోరీ అని తెలుస్తోంది. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ మరో కథానాయకుడిగా నటిస్తున్నారు.

    ట్రిపుల్ ఆర్ షూటింగ్ (RRR movie unit)
    ’ఆర్ఆర్ఆర్’ సినిమా (Twitter/Photo)


    ఐతే.. ఈ సినిమాను డీవివి దానయ్య భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు  నార్త్‌లో పెన్ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ సందర్భంగా పెన్ స్టూడియోస్‌ ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ పార్టనర్స్‌ను అనౌన్స్ చేసారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ డిజిటల్ రైట్స్‌ను జీ 5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్టు ప్రకటించారు. ఇక హిందీ వెర్షన్ డిజిటల్ రైట్స్‌‌ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్టు ప్రకటించారు. అంతేకాదు ఇంగ్లీష్, టర్కిష్, పోర్చుగీసు, కొరియన్, స్పానిష్ భాషలకు సంబంధించిన డిజిటల్ ప్రసారాలను కూడా నెట్‌ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసింది.

    RRR Rajamouli Jr NTR Ram Charan Ajay Devgn RRR Roudram Ranam Rudhiram Again Postponed New Release Date Is Locked,RRR: ఆర్ఆర్ఆర్ సినిమా కొత్త విడుదల తేది.. ఈ యేడాది కూడా అభిమానులకు నిరాశే..,RRR,RRR New Release Date,26 January 2021 RRR Release,RRR Crazy Update,Rajamouli jr ntr ram Charan RRR,ZEE5, Zee network acquired the digital and satellite rights of RRR Movie in all languages,pen movies acquired the North India Distribution Rights, Ram Charan Birth day gift, Nick Powell Ram charan ntr RRR new Release Date confirmed officially announced, RRR Release Date leaked, English actor alison doody leaks the rrr release date, RRR update, ntr news, ntr intro,RRR update,Ntr as Komaram Bheem look,RRR fight secens,RRR news,RRR ntr fight,RRR leaks,ఆర్ ఆర్ ఆర్ లీక్స్, రాజమైమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, charan intro,charan rrr intro, ntr rrr intro rrr release date,RRR Movie,RRR Digital Satelite partners,,ఆర్ఆర్ఆర్,ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా,రాజమౌళి,ఎన్టీఆర్,రామ్ చరణ్,వచ్చే యేడాది విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ మూవీ
    RRRలో ఎన్టీఆర్, రామ్ చరణ్ (Twitter/Photo)


    ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌కు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, రామ్ చరణ్ సరసన హీందీ నటి అలియా భట్, అజయ్ దేవ్‌గణ్ సరసన శ్రియ నటిస్తోంది.  కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ దాదాపు ఓ ఎనిమిది నెలలు వాయిదా పడింది. ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ తాజాగా ఈ సినిమాను వచ్చే యేడాది.. జనవరి 26న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరి ముందుగా చెప్పినట్టే అక్టోబర్ 13నే ఈ సినిమా విడుదల కానుందా.. మరోసారి రిలీజ్ డేట్ ఛేంజ్ చేసుకుంటుందా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: