Home /News /movies /

RRR MAN DIED AT DURING WATCHING THE RRR MOVIE AT ANATHAPUR DSTICT HERE ARE THE DETAILS TA

RRR : ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తూ గుండెపోటుతో అభిమాని మృతి.. ఇంతకీ ఏం జరిగిందంటే..

RRR మూవీ చూస్తూ అభిమాని గుండెపోటుతో మృతి (File/Photo)

RRR మూవీ చూస్తూ అభిమాని గుండెపోటుతో మృతి (File/Photo)

RRR : బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ముఖ్యపాత్రల్లో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. తాజాగా ఈ సినిమా చూస్తూ ఓ అభిమాని గుండెపోటుతో చనిపోయారు. వివరాల్లోకి వెళితే. .

    RRR : బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ముఖ్యపాత్రల్లో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్నో అంచనాల మధ్య ప్యాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 10 వేలకు స్క్రీన్స్‌లో విడుదలైంది. దాదాపు రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో భారీ అంచనాలతో మధ్య ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)మూవీ  విడుదలై మంచి టాక్‌తో దూసుకుపోతోంది. తాజాగా ఈ మూవీ విడుదలైన నేపథ్యంలో అభిమానులు ఉదయం నుంచే థియేటర్స్ వద్ద పడిగాపులు కాయడంతో పాటు తమ అభిమాన హీరో సినిమాను చూడ్డానికి కళ్లలో ఒత్తులు వేసుకొని మరి ఎదురుచూసారు. ఎన్నో అవాంతరాలు.. ఎన్నో రిలీజ్ డేట్స్ తర్వాత ఎట్టకేలకు ఈ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అభిమానులను అలరిస్తోంది.

    ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్  సినిమా విడుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో విషాదం చోటు చేసుకుంద. ఈ సినిమాను అక్కడి SV మ్యాక్స్ థియేటర్‌లో  ఈ మూవీ బెనిఫిట్ షో  చూస్తూ  ఉండగా ఓబులేసు అనే అభిమాని గుండెపోటు వచ్చింది. దీంతో అతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ లోపు అతని మృతి చెందినట్టు డాక్టర్లు చెప్పడంతో అనంతపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

    RRR Movie Review : ఆర్ఆర్ఆర్ మూవీ రివ్యూ.. సిల్వర్ స్క్రీన్ పై రాజమౌళి మ్యాజిక్ పని చేసిందా..

    ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికొస్తే..  ఈ సినిమా ప్రీమియర్స్ షో ద్వారా చాలా ప్రాంతాల్లో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.   పైగా  ప్యాన్ ఇండియా మూవీ కావడంతో రాజమౌళి.. ఎన్టీఆర్ ,రామ్ చరణ్‌లను వెంటేసుకొని దేశం మొత్తాన్ని చుట్టేసారు. విడుదల తర్వాత మరోసారి ఈ సినిమాను ప్రమోట్ చేసే అవకాశాలున్నాయి. ఇక ప్రముఖ బాలీవుడ్ మీడియా సంస్థలు కూడా ఈ సినిమాపై పాజిటివ్‌గా స్పందించాయి.  ఇక ఈ సినిమాను మేకర్స్.. ఐమాక్స్, 3D, డాల్బీ ఫార్మాట్‌లో రిలీజ్ చేసారు. ఇక డాల్బీ విడుదల కాబోతున్న మొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎక్కింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా  ఈ సినిమా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. ఇక ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలతో పాటు పక్కనే ఉన్న కర్ణాటకలో కూడా భారీ ఎత్తున విడుదలైంది.

    RRR US Premiers : ’ఆర్ఆర్ఆర్’ సహా ఓవర్సీస్‌లో US ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు..


    ఇక ఆర్ ఆర్ ఆర్ (RRR) విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు.  మరోవైపు ఈ (RRR) చిత్రం ఓటిటి రిలీజ్‌ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయికాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ (RRR) విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Jr ntr, Rajamouli, Ram Charan, RRR, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు