RRR నుంచి చరణ్, అలియా లుక్స్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..

RRR Leaks : దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న RRR నుంచి చరణ్, అలియా లుక్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

news18-telugu
Updated: February 18, 2020, 10:25 AM IST
RRR నుంచి చరణ్, అలియా లుక్స్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్..
ఎన్టీఆర్, రాజమౌళి, చరణ్ Twitter
  • Share this:
RRR : అగ్ర దర్శకుడు రాజమౌళి డైరెక్షన్‌లో తెలుగు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌ ప్రధాన పాత్రల్లో తెలుగు వీరుల కథ ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇదీ అవ్వడానికి నిజ జీవిత తెలుగు వీరుల కథ అయినా.. చాలా వరకు ఫిక్షన్ కథాంశంతో రానుంది. ఆర్ ఆర్ ఆర్‌లో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అలరించనున్నాడు. చరణ్‌కు జోడిగా అలియా భట్ నటిస్తుంటే.. ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరీస్ నటిస్తోంది. ఈ సినిమా పిరియాడిక్ కథతో బ్రిటీష్ వారు ఇండియాను పాలిస్తున్న కాలం నేపథ్యంలో తెరకెక్కుతోంది. కాగా ఈ సినిమాకు సంబందించి అప్పటికాలంలో రామ్ చరణ్, అలియా భట్ లుక్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలియా ఈ సినిమాలో చరణ్ ప్రేయసి సీతా మహాలక్ష్మి పాత్రలో కనిపించనుంది. వీరిద్దరి లుక్‌లకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో బ్రిటీష్ సైనికాధికారిగా రామ్ చరణ్ కనిపిస్తుండగా, అలియా భట్ పాతకాలం నాటి పద్దతిలో చీర కట్టుకొని సీతామహాలక్ష్మి లుక్‌లో కనపడుతోంది.

ఈ ఫొటోలు కూడా ఆ కాలంలో ఉండే ఫోటోల మాదిరిగా బ్లాక్‌ అండ్ వైట్‌లో ఉండటం గమనించదగ్గ విషయం. దీనికి తోడు ఆ పిక్స్‌పై రాజమౌళి ముద్ర కూడా ఉంది. అయితే మరీ ఈ పిక్స్ నిజమైనవా.. లేదా కావాలనే ఎవరన్న అభిమానులు చేశారా అనేది మాత్రం తెలియదు. కాగా ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 భాషాల్లో విడుదలకానుంది. ఈ సినిమాలో ఇతర ముఖ్య పాత్రల్లో హిందీ నటుడు అజయ్ దేవగన్, తమిళ దర్శకుడు సముద్ర ఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వికారాబాద్ అడవుల్లో శరవేగంగా జరుగుతోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నాడు.






 



View this post on Instagram




 

#rrrmovie #rrr #ramcharan #aliyabhatt #ssrajamouli


A post shared by Cinema Circle (@1.cinemacircle) on




First published: February 18, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు