హోమ్ /వార్తలు /సినిమా /

RRR Closing Collections : ముగిసిన ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ రన్.. టోటల్‌ కలెక్షన్స్ ఇవే..

RRR Closing Collections : ముగిసిన ఆర్ఆర్ఆర్ థియేట్రికల్ రన్.. టోటల్‌ కలెక్షన్స్ ఇవే..

RRR World Wide Closing Collections : ఆర్ఆర్ఆర్ రాజమౌళి డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదు చేస్తోంది. కేజీఎఫ్ 2 వచ్చిన ఈ సినిమా వీక్ డేస్‌లో డీసెంట్ వసూళ్లను సాధించింది.ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ సినిమా అన్ని ఏరియాల్లో థియేట్రికల్ రన్ ముగిసింది. మొత్తంగా ఈ సినిమా వాల్డ్ వైడ్‌గా ఎన్నికోట్లు రాబట్టిందంటే..

ఇంకా చదవండి ...

RRR Closing Collections :ఆర్ఆర్ఆర్ రాజమౌళి  (Rajamouli) డైరెక్షన్‌లో  తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ (Jr NTR, Ram Charan)  వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా  థియేట్రికల్ రన్ క్లోజింగ్ వచ్చింది.  ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్టైనా.. ఏదో ఒక ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేకపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం అన్ని ఏరియాల్లో లాభాల్లో రావడం విశేషం.ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది.ఆలియా భట్, ఒలివియా మోరీస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఇపుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో అన్ని ఏరియాల్లో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది.

నైజాం (తెలంగాణ):  రూ. 111.85 కోట్లు  /రూ . 70 కోట్లు

సీడెడ్ (రాయలసీమ): రూ. 51.04 కోట్లు  / రూ. 37 కోట్లు

ఉత్తరాంధ్ర: రూ. 36.40 కోట్లు / రూ. 22 కోట్లు

ఈస్ట్: రూ. 16.24 కోట్లు  / రూ. 14 కోట్లు

వెస్ట్: రూ. 13.31 కోట్లు /రూ. 12 కోట్లు

గుంటూరు: రూ. 18.21 కోట్లు / రూ. 15 కోట్లు

కృష్ణా:రూ. 14.76 కోట్లు  / రూ. 13 కోట్లు

నెల్లూరు: రూ. 10.50 కోట్లు / రూ. 8 కోట్లు

Telagana - AP : రూ. 272.31 కోట్లు (రూ. 415 కోట్లు గ్రాస్ )

NTR Birth Anniversary : అన్న ఎన్టీఆర్‌ సహా రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్న సినీ ప్రముఖులు వీళ్లే..


తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ TG+ AP : రూ. 272.31 కోట్లు (రూ. 415 కోట్లు గ్రాస్)/ (టోటల్ తెలంగాణ+ఏపీ  బిజినెస్ రూ. 191 కోట్లు) ముందుగా రూ. 211 కోట్లకు అమ్మారు. కొన్ని ఏరియాల్లో తగ్గించిన తర్వాత రూ. 191కోట్లకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లో  ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది.

కర్ణాటక: రూ. 44.50 కోట్లు (రూ 83.40 కోట్లు గ్రాస్) / రూ. 41 కోట్లు

తమిళనాడు: రూ. 38.90 కోట్లు (రూ. 77.25 కోట్లు గ్రాస్)  / రూ. 35 కోట్లు

కేరళ:  11.05 కోట్లు (24.25 కోట్లు గ్రాస్) / రూ. 9 కోట్లు

హిందీ: 134.50 కోట్లు (రూ. 326 కోట్లు గ్రాస్) / రూ. 92 కోట్లు

రెస్టాఫ్ భారత్ : రూ.9.30 కోట్లు (రూ. 18.20 కోట్ల గ్రాస్)  / రూ. 8 కోట్లు

ఓవర్సీస్: రూ. 102.50 కోట్లు(రూ. 206 కోట్ల గ్రాస్)  / రూ. 75 కోట్లు)

వరల్డ్ వైడ్  కలెక్షన్స్ :రూ. 613.06 కోట్లు షేర్ (రూ.1150.10 కోట్ల గ్రాస్) / (ఆర్ఆర్ఆర్ టోటల్ వాల్డ్ వైడ్ బిజినెస్ రూ.. 451 కోట్లు)

F3 - 1st Day WW Collections : వెంకటేష్, వరుణ్ తేజ్‌ల ‘F3’ మూవీ ఫస్ట్ డే వాల్డ్ వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్స్..

ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 613.06 కోట్ల షేర్ (రూ. 1150.10 కోట్లు గ్రాస్) రాబట్టింది.  అన్ని ఏరియాల్లో కలిపి ఈ సినిమాను రూ. 451 కోట్లకు అమ్మారు. ఈ సినిమా అన్ని ఏరియాల్లో ఓవరాల్‌గా రూ. 160.06  కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ స్టేటస్‌ అందుకుంది.

First published:

Tags: Jr ntr, Rajamouli, Ram Charan, Roudram Ranam Rudhiram, RRR, Tollywood

ఉత్తమ కథలు