RRR IF ALL GOES AS PLANNED RRR RAJAMOULI JR NTR RAM CHARAN AJAY DEVGNS ROUDRAM RANAM RUDHIRAM MOVIE RELEASE TODAY TA
RRR : అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ రోజు రాజమౌళి RRR విడుదల.. కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ?
ఆర్ఆర్ఆర్ మూవీ పోస్టర్ (Twitter/Photo)
RRR : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. అంతా బాగుంటే ఈ రోజు ఈ సినిమా విడుదలై ఉండేది.
RRR : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా అనేక రాష్ట్రాలు థియేటర్స్‌ను మూసివేస్తున్న నేపథ్యంలో తమ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. అంత ఓమైక్రాన్ రూపంలో కరోనా థర్డ్ వేవ్ లేకపోయి అంతా అనుకున్నట్లు జరిగితే.. ఆర్ఆర్ఆర్ ఈ రోజు విడుదలై ఉండేది. మరోవైపు ఓవర్సీస్తో పాటు తెలుగు రాష్ట్రాల పాటు.. కొన్ని రాష్ట్రాలల్లో ప్రీమియర్స్‌తో ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఉండేవారు. ఈ పాటికీ తెలుగుతో పాటు మిగతా భాషల్లో కూడా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా గురించే చర్చ జరిగి ఉండేది.
జనవరి 7న మాత్రం కచ్చితంగా రిలీజ్ అవుతుందని భావించిన అటు రాజమౌళి అండ్ టీం కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేసింది. దాదాపు ప్రమోషన్స్ కోసం స్పెషల్‌గా ఓ ఫ్లైట్‌ను ఏర్పాటు చేసుకొని దేశంలోని ముఖ్యనగరాలైన కొచ్చి, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఎంతో అట్టహాసంగా ఈ మూవీ ప్రమోషన్స్ చేశారు.దీని కోసం ఏకంగా రూ. 40 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. అయితే రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసుల నేపధ్యంలో RRR సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు మేకర్. దీంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ అభిమానులంతా ఉసూరుమన్నారు.
గతంలో రెండు సార్లు వాయిదా పడ్డప్పటికీ, అఖండ, పుష్ప ఇచ్చిన జోష్ తో సంక్రాంతి సెలవల నేపథ్యంలో జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామన్న ధీమాతో RRR మూవీ ప్రమోషన్ భారీగా చేసేశారు. ఆయా నగరాల్లో చేసిన ఈవెంట్స్ కు RRR యూనిట్ అంతా తరలివెళ్లింది. అటు హీరోయిన్ ఆలియా భట్ సైతం ప్రమోషన్స్ లో పాల్గొంది.దర్శక బాహుబలిరాజమౌళి, రామా రావు (ఎన్టీఆర్), రామ్ చరణ్ కాంబినేషన్లో ‘ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్‌ను సరిగ్గా నాలుగేళ్ల క్రితం 18 నవంబర్ 2017న రాజమౌళి, ఎన్టీఆర్ ,రామ్ చరణ్‌లతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసారు.
నందమూరి, మెగా హీరోలతో మల్టీస్టారర్ అనగానే టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా మారింది. అంతకు ముందు రెబల్ స్టార్ ప్రభాస్‌ను ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ చేసిన రాజమౌళి .. ఆ తర్వాత ఏ హీరోతో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తాడా అనేది ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. జక్కన్న బాలీవుడ్ హీరోలతో తన తర్వాతి ప్రాజెక్ట్ అంటూ రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ.. నందమూరి, మెగా హీరోలను కేవలం తన మాటతో ఒకే సినిమాలో నటింప జేసేలా ఒప్పించారు.
RRR మూవీ (Twitter/Photo)
ఇండస్ట్రీలో బడా హీరోలతో సినిమాలు చేయాలని అందరి దర్శకులకు ఓ కల ఉంటోంది. కానీ రిరవ్స్లో రాజమౌళితో సినిమా చేయడానికి అగ్ర హీరోలను తన చుట్టూ క్యూ కట్టేలా చేసి నిజంగానే దర్శక బాహుబలిగా నిలిచారు. ఇక రాజమౌళి నుంచి పిలుపు రావడంతోనే ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కథ వినకుండా ఈ సినిమా చేయడానికి ఓకే చెప్పారు. జక్కన్న తమతో సినిమా చేయడమే తమ భాగ్యంగా భావించే స్థితిలో టాలీవుడ్ అగ్ర హీరోలున్నారు.
ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్‌ల స్టార్డమ్ వెనక రాజమౌళి సింహాద్రి, మగధీర సినిమాలే కీ రోల్ ప్లే చేసిన సంగతి తెలిసిందే కదా. ముందుగా ఈ సినిమాను 2020 జూలై 31న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత కరోనా మహామ్మారి విజృంభనతో ఈ సినిమా షూటింగ్ లేట్ అయింది. ఆ తర్వాత ఈ సినిమాను 8 జనవరి 2021 న మరోసారి రిలీజ్ డేట్ మార్చారు. ఇక అప్పటికీ కరోనా కెేసులు తగ్గకపోవడంతో పాటు షూటింగ్ లేట్ కావడంతో ఈ సినిమాను 13 అక్టోబర్ 2021 దసరా కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే ఓవర్సీస్లో అడ్వాన్స్ రూపంలో 2 మిలియన్స్ పైగా కలెక్షన్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా.
RRR మూవీ (Twitter/Photo)
ఇప్పటికే మూడు రిలీజ్ డేట్లు ఛేంజ్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు 7 జనవరి 2022న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ నాలుగో సారి కూడా ఈ సినిమా వాయిదా పడింది. అన్ని కుదిరితే ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న బాహుబలి 2 విడుదలైన డేట్లో రిలీజ్ చేయాలనో ఆలోచనలో ఉంది. విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది.
రీసెంట్గా ఈ సినిమాపై హైదాబాద్ హైకోర్టులో ఏపీలోని పశ్చిమ గోదావరి ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య కోర్టులో ఈ పిల్ (PIL) దాఖలు చేశారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ చారిత్రక యోధులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రల్లో నటించారు. ఇందులో చారిత్రక యోధుల పాత్రలను రాజమౌళి వక్రీకరించి చిత్రీకరించారని ప్రధానంగా తమ పిటిషన్లో పేర్కొన్నారు. మహనీయుల అసలు చరిత్ర కాకుండా... కాల్పనిక కథతో సినిమా తెరకెక్కించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. త్వరలో కోర్టు ఈ సినిమాపై ఏ విధమైన తీర్పు ఇస్తుందో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.