RRR HINDI DIGITAL PREMIER STREAMING IN NETFLIX ON JUNE 2 HERE ARE THE DETAILS TA
RRR : రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ హిందీ డిజిటల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
నెట్‌ఫ్లిక్స్‌లో RRR హిందీ స్ట్రీమింగ్ (Twitter/Photo)
RRR OTT Trailer | ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ నుంచి సౌత్‌తో పాటు హిందీ ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించిన డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు.
ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందింది. రీసెంట్గా 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా తెలుగులో పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆర్ఆర్ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్లో అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 14 మిలియన్ డాలర్స్‌పైగా వసూలు చేసి రూ. 100 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది. అయితే అమెరికాలో ఈ ఫీట్ సాథించిన మరో సినిమా బాహుబలి 2 (Bahubali).. ఇండియా నుంచి ఈ రెండు సినిమాలు అమెరికాలో 100 కోట్ల గ్రాస్‌ను అందుకున్నాయి.
ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ రెండు సినిమాలు కూడా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చినవే. ఆర్ ఆర్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 451 కోట్ల బిజినెస్ చేయగా... 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించి ఈ సినిమా ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తోంది.ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ తెలుగుతో పాటు తమిళ, మలయాళీ, కన్నడ భాషల్లో ఈ నెల 20 నుంచి జీ5 ప్రీమియంలో స్ట్రీమింగ్ కానుంది అక్కడ. మే 20న ఈ సినిమా పే ఫర్ వ్యూ పద్దతిన జీ5లో స్ట్రీమింగ్ రానుంది. అంటే సినిమా చూడాలంటే పే చేయాలన్న మాట.
సబ్స్క్రైబర్స్ 100 రూపాయలు పే చేయాలన్నమాట. ఇక కొత్తగా వచ్చేవారు మాత్రం రూ. 699 చెల్లించాలి. ఇక హిందీలో ఈ సినిమా చూడాలనేకునే వారు.. బుక్ మై షో లో రూ. 100 చెల్లించి చూడవచ్చు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన హిందీ డిజిటల్ ప్రీమియర్‌ను జూన్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేశారు.
నెట్‌ఫ్లిక్స్‌లో RRR హిందీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ (Twitter/Photo)
ఇక అది అలా ఉంటే ఈ సినిమా U.S. సినీ ప్రేక్షకులకు మరోసారి అందుబాటులోకి వస్తోంది. ఈ సినిమా జూన్ 1 న ఒక్కరోజు 100 థియేటర్స్‌లో విడుదలకానుంది. అంతేకాదు అక్కడి ప్రేక్షకుల కోసం అసలైన అన్‌కట్ తెలుగు వెర్షన్‌ను ప్రదర్శించనున్నారట. అన్‌కట్ వెర్షన్‌తో పాటు డాల్బీ అట్మాస్ సౌండ్ మిక్స్ కూడా ఉండనుందట.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.