Alia Bhatt - Gangubai Kathiawadi : ఓరినీ అభిమానం తగిలేయ్యా.. ఆలియా కోసం పాకిస్థాన్ నటుడు చేసిన ఈ పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. వివరాల్లోకి వెళితే.. అభిమానులందు వీరాభిమానులు వేరు అంటూ కొంత మంది చూస్తే నిజమే అనిపిస్తోంది. తాజాగా ఆలియా భట్‌కు చెందిన ఓ పాకిస్తానీ నట అభిమాని చేసిన పని తెలిసి అందరు షాక్ అవుతున్నారు. ఆలియా భట్ (Alia Bhatt ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. తన తండ్రి దర్శక, నిర్మాత మహేష్ భట్ వారసత్వంగా సినిమాల్లోకి వచ్చారు. అయినా తనదైన నటనతో ప్రేక్షకుల్నీ మెప్పిస్తున్నారు. ఆమె నటించిన మొదటి సినిమా 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', ఆ తర్వాత 'డియర్ జిందగీ, 'హైవే', 'రాజీ' మొదలగు సినిమాలు మంచి పేరును తెచ్చిపెట్టాయి.
అంతేకాకుండా.. ఈ భామ తెలుగులో తొలిసారి రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న RRRలో సీత (Alia Bhatt ) పాత్రలో నటించింది. ఎపుడో విడుదల కావాల్సిన మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. అది అలా ఉంటే ఆలియా భట్ హిందీలో పలు సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆమె నటించిన లేటెస్ట్ సినిమా 'గంగూబాయి కతియావాడి' (Gangubai Kathiawadi) . ఈ సినిమాను ప్రముఖ హిందీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసారు. ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలైంది. ఈ సినిమాలో ఆలియా (Alia Bhatt ) నటనకు ప్రేక్షకులే నుంచే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి.
ఆలియా భట్ అద్భుతమైన నటనతో అదరగొట్టిందనే అంటున్నారు నెటిజన్స్. అలియా భట్ ఈ సినిమాలో వ్యభిచారి, లేడీ బాస్ పాత్రలో ఇరగదీసిందని అంటున్నారు. గుంగుబాయి (Gangubai Kathiawadi) సినిమాను హుస్సేన్ జైదీ రాసిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. ముంబైలోని కామాటిపురాలో గంగూభాయ్ (Gangubai Kathiawadi) ఎలా మాఫియా క్వీన్‌గా ఎదిగిందో ఈ మూవీలో చూపించారు.
తాజగా ఈ సినిమా చూడటానికి ఓ అభిమాని దుబాయ్‌లో ఏకంగా ఓ థియేటర్‌నే బుక్ చేసాడు. పాకిస్తాన్‌కు చెందిన మునీబ్ భట్.. ఆయన భార్య అమైన్ ఖాన్ కోసం ఏకంగా దుబాయ్‌లో ఆలియా భట్ నటించిన ‘గంగుబాయి కతియావాడి’ సినిమా కోసం ఓ థియేటర్‌ను బుక్ చేశారు. ఇక భార్యాభర్తలైన వీళ్లిద్దరు కలిసి థియేటర్లో ‘గంగుబాయ్ కతియావాడి’ సినిమాను తెగ ఎంజాయ్ చేసినట్టు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
పాకిస్థాన్ యాక్టర్ మునీబ్ భట్ విషయానికొస్తే.. ఈయన ఉర్దూ సినిమా మరియు టెలివిజన్‌లో పనిచేసారు. 2012లో ఈయన ఈయన నటుడిగా కెరీర్ మొదలు పెట్టారు. ఈయన ‘దల్దల్’, బాందీ’, కోయి చంద్ రఖ్, కైసా హైద నసీబన్ వంటి సినిమాలు, సీరియల్స్‌లో నటించారు. 2019లో వీరికి అమల్ అనే కూతురు ఉంది. ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. గంగూబాయి కతియావాడి చిత్రం ఇప్పటికే వంద కోట్ల క్లబ్లో చేరింది. ఓ కీలకపాత్రలో హిందీ స్టార్ హీరో అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.