Ram Charan : ఆర్ఆర్ఆర్ కంటే ముందు బాలీవుడ్లో విడుదల కానున్న రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ.. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంప్లీట్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్య పాత్రలో నటించారు. అంతా బాగుంటే.. ఈ సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదలై ఉండేది. కానీ ఓమైక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువ కావడంతో ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాపై బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. RRR మూవీని కొత్త రిలీజ్ డేట్ అనేది .. కరోనా కేసులపై ఆధారపడి ఉంది. ప్రస్తుతం మన దేశం కరోనా థర్డ్ వేవ్‌లో ప్రవేశించింది. ఫిబ్రవరి వరకు పీక్స్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. ఈ సినిమాను ఏప్రిల్ 28న బాహుబలి రిలీజ్ రోజున విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం.
మరోవైపు రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవితో కలిసి నటించిన ‘ఆచార్య’ సినిమాను ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్ 1 కు పోస్ట్ పోన్ చేశారు. ఇక ఆర్ఆర్ఆర్ కంటే ముందు రామ్ చరణ్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమాను హిందీలో డబ్ చేసి విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అల వైకుంఠపురములో’ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్‌ను ఈ నెల 26న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇప్పటికే ‘పుష్ప’తో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో హిందీలో ఓమైక్రాన్ నేపథ్యంలో హిందీలో సరైన పెద్ద సినిమాలు విడుదల కానీ ఈ టైమ్‌లో ‘పుష్ప’ సినిమాతో వచ్చిన ఇమేజ్ను హిందీలో క్యాష్ చేసుకోనే పనిలో ఉన్నారు చిత్ర నిర్మాతలు. అందుకే హిందీలో ఓ వైపు ‘అల వైకుంఠపురములో’ మూవీ రీమేక్ అవుతున్నా.. ఇపుడు సడెన్‌గా హిందీ డబ్బింగ్ వెర్షన్‌తో ఎంతో కొంత రాబట్టుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు కనపడుతోంది.
అదే రూట్లో ‘రంగస్థలం’ సినిమా హిందీ వెర్షన్‌ను అదే టైటిల్‌తో విడుదల చేయనున్నారు. త్వరలో విడుదల తేది అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు. మొత్తంగా ‘పుష్ప’తో దర్శకుడు సుకుమార్.. ఆర్ఆర్ఆర్తో రామ్ చరణ్‌కు మంచి గుర్తింపు వచ్చింది.
ప్రస్తుతం రామ్ చరణ్ .. తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ సినిమాను శంకర్ సరికొత్త కాన్సెప్ట్‌తో తనదైన శైలిలో తెరకెక్కించబోతున్నారు. అటు శంకర్ సినిమా చేస్తూనే.. రామ్ చరణ్ తన నెక్ట్స్ మూవీని ‘జెర్సీ’తో ఆకట్టుకున్న గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయనున్నారు. ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆ తర్వాత శ్యామ్ సింగరాయ్’ సినిమాతో ఆకట్టుకున్న రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.