ఎన్టీఆర్ ఇపుడు తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబందించిన జబర్ధస్త్ యాంకర్ అనసూయ సాయం తీసుకుంటున్నట్టు సమచారం. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో తారక్.. కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా లాక్డౌన్ కారణంగా ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్‌కు పోస్ట్ పోన్ అయింది. మరోవైపు ఎన్టీఆర్ రాజమౌళి సినిమా తర్వాత త్రివిక్రమ్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్‌తో పాటు తమిళ దర్శకుడు అట్లీతో వరుస ప్రాజెక్ట్‌లకు కమిటయ్యాడు. ఇక త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ కూడా భార్గవ్ హరి అనే కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను తన తండ్రి కొడుకులు పేరు మీదుగా స్టార్ట్ చేయనున్నాడు. దాంతో పాటు ఎన్టీఆర్ త్వరలోనే ఒక ఎంటర్టైన్మెంట్ ఛానెల్‌ను స్టార్ట్ చేయనున్నట్టు సమాచారం. దాని కోసం ప్రముఖ యాంకర్ అనసూయ భరద్వాజ్‌ను సంప్రదించనున్నట్టు సమాచారం.
ఎన్టీఆర్, అనసూయ భరద్వాజ్ (File/Photo)
ఇప్పటికే తన మామ నార్నే శ్రీనివాస్‌కు చెందిన ఎంటర్టైన్మెంట్ ఛానెల్నే ఎన్టీఆర్ కొత్తగా ముస్తాబు చేయనున్నాడట. తనకు సంబంధించిన కొంత మందితో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి అందులో సరికొత్త ప్రోగ్రామ్స్‌ను ప్రసారమయ్యేలా చూడమని చెప్పాడట. అందులో భాగంగా ఈ ఛానెల్‌కు సంబంధించిన కొన్ని కీలకమైన బాధ్యతలను అనసూయకు అప్పగించాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నాడట. వచ్చే యేడాది సంక్రాంతికి ఈ చానెల్‌ను సరికొత్తగా లాంఛ్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా తనకు స్నేహితుడైన రాజీవ్ కనకాల భార్య సుమ ద్వారా అనసూయను సంప్రదించినట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు సుమ, రాజీవ్ కనకాలనే ఈ ఛానెల్ ముఖ్య బాధ్యతులు నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. ఈ ఛానెల్ కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ. 100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టబోతున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ ఛానెల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తారట.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.