చిరంజీవికి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ థాంక్స్..

చిరంజీవి,ఎన్టీఆర్ (File/Photos)

మెగాస్టార్ చిరంజీవికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసాడు. వివరాల్లోకి వెళితే.. ఈ ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ అయిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా.

  • Share this:
మెగాస్టార్ చిరంజీవికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసాడు. వివరాల్లోకి వెళితే.. ఈ ఉగాది సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ అయిన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు శ్రీ శార్వరి నామ సంవత్సర కానుగా ఆర్ఆర్ఆర్ టీమ్ ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సందర్భంగా చిరంజీవి  ట్విట్టర్ వేదికగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను మెచ్చున్నారు. చూస్తుంటే గూస్ బంప్స్ అదిరిపోయేలా ఈ పోస్టర్ ఉందన్నారు. ఇందులో ఎన్టీఆర్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా.  తాజాగా జూనియర్ ఎన్టీఆర్  ట్వీట్ చేస్తూ.. థాంక్స్ సర్.. మీ నుంచి వచ్చిన ఈ మాటలు ఎంతో విలువైనయి అని చెప్పుకొచ్చారు. దాంతో పాటు సోషల్ మీడియా అయిన ట్విట్టర్‌లో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ విషెస్ తెలియజేసాడు జూనియర్ ఎన్టీఆర్.


ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే.. ఈ సినిమాకు తెలుగులో ‘రౌద్రం రణం రుధిరం’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు. ఈసినిమాకు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ‘రైజ్ రోర్ రివోల్ట్’ అనే పేరును ఖరారు చేసారు. కన్నడలో మాత్రం ‘రౌద్ర రణ రుధిర’ అనే పేరు పెడితే.. తమిళంలో మాత్రం ‘రథమ్ రణమ్ రౌథిరమ్’ అనే టైటిల్ పెట్టారు. మలయాళంలో మాత్రం ‘రుధిరమ్ రణమ్ రౌద్రమ్’ అనే పేర్లు పెట్టారు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్‌గా నటిస్తే.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ అగ్ర నటుడు అజయ్ దేవ్‌గణ్’ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. మొత్తానికి బ్రిటిష్ ప్రభుత్వంలపై కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు కట్టలు తెచ్చుకున్న రౌద్రంతో వీళ్లిద్దరు కలిసి చేయాలనుకున్న రణం. ఆ యుద్ధంలో ఈ యోధులు అర్పించిన రుధిరం. అంటే రక్తం చిందించడం అనే అర్ధంతో ఈ సినిమా టైటిల్ పెట్టారు. మొత్తానికి రాజమౌళి నుంచి ఈ వస్తోన్న ఈచిత్రం వచ్చే యేడాది సంక్రాంతి కానుంగా జనవరి 8న విడుదల కానున్నట్టు మరోసారి స్పష్టం చేసారు.
Published by:Kiran Kumar Thanjavur
First published: