జూలై 17న అభిమానులకు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిప్ట్..

ఎన్టీఆర్ ఈ నెల 17 అభిమానులకు స్పెషల్ గిప్ట్ ఇవ్వబోతున్నాడు. అది చూసి అభిమానులు కూడా సంతోష పడుతున్నారు. ఇంతకీ ఈ నెల 17న ఎన్టీఆర్ ఇవ్వబోతున్న స్పెషల్ గిప్ట్ ఏంటో తెలుసా.. వివరాల్లోకి వెళితే..

news18-telugu
Updated: July 13, 2020, 12:49 PM IST
జూలై 17న అభిమానులకు ఎన్టీఆర్ సర్ప్రైజ్ గిప్ట్..
జూనియర్ ఎన్టీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఎన్టీఆర్ ఈ నెల 17 అభిమానులకు స్పెషల్ గిప్ట్ ఇవ్వబోతున్నాడు. అది చూసి అభిమానులు కూడా సంతోష పడుతున్నారు. ఇంతకీ ఈ నెల 17న ఎన్టీఆర్ ఇవ్వబోతున్న స్పెషల్ గిప్ట్ ఏంటో తెలుసా.. వివరాల్లోకి వెళితే..ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’  సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో జూనియర్.. కొమరం భీమ్ పాత్రలో యాక్ట్ చేస్తున్నాడు. మరోవైపు ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్‌లో రామ్  చరణ్ నటిస్తున్నాడు. బాహుబలి తర్వాత జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్.. త్రివిక్రమ్ సినిమాతో పాటు కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి ఓకే చెప్పాడు.ఐతే.. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి రామ్ చరణ్.. ఫస్ట్ లుక్ వచ్చినా..  లాక్‌డౌన్ కారణంగా ఆర్ఆర్ఆర్ సినిమాలో   జూనియర్ ఎన్టీఆర్ లుక్’తో పాటు ఏ సమాచారాన్ని విడుదల చేయలేదు చిత్ర యూనిట్. కానీ ఈ నెల 17న ఎన్టీఆర్ తమ అభిమానుల కోసం సర్ప్రైజ్ గిప్ట్ ఇవ్వబోతున్నాడు. అంతేకాదు ఆ రోజు ఫ్యాన్స్‌తో పాటు అందిరి ముందు దర్శనమివ్వనున్నాడు. ప్రెజెంట్ టాలీవుడ్‌లో హీరోగా ఎన్టీఆర్ కున్న క్రేజ్ సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అయితే.. తారక్ మాత్రం తన క్రేజ్‌ను ఇప్పటి తరంలో అందిరి హీరోల మాదిరిగా క్యాష్ చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఎన్టీఆర్ ఈ నెల 17 అభిమానులకు స్పెషల్ గిప్ట్ ఇవ్వబోతున్నాడు. అది చూసి అభిమానులు కూడా సంతోష పడుతున్నారు. ఇంతకీ ఈ నెల 17న ఎన్టీఆర్ ఇవ్వబోతున్న స్పెషల్ గిప్ట్ ఏంటో తెలుసా.. వివరాల్లోకి వెళితే..
జూలై 17న అభిమానులకు తారక్ స్పెషల్ గిప్ట్ (Instagram/Photo)


దాంతో సెలెక్ట్ అనే మొబైల్ ఫోన్స్ అమ్మకాలు చేసే కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ నెల 17న సెలెక్ట్ మొబైల్‌కు సంబంధించిన కొత్త యాడ్ ప్రసారం కానుంది. ఈ సందర్భంగా సెలెక్ట్ కంపెనీలు వాళ్లు ఓ ఫోటోను రిలీజ్ చేసారు. మొత్తంగా సినిమాలకు సంబంధించిన విషయంలో వెనకబడ్డ ఎన్టీఆర్.. యాడ్స్ విషయంలో దూకుడుమీదున్నాడు.
Published by: Kiran Kumar Thanjavur
First published: July 13, 2020, 12:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading