అవును జూనియర్ ఎన్టీఆర్ విజయ్‌కు అండగా ఉంటానని భరోసా ఇస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో జూనియర్ ..కొమరం భీమ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఒక విజయ్ విషయానికొస్తే.. గతేడాది ‘బిగిల్’ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘విజిల్’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తే..ఇక్కడ మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం విజయ్.. ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు. ‘మాస్టర్’ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ ఒక పాట పాడబోతున్నాడు.
విజయ్ గతంలో ఎన్నో సినిమాల్లో సింగర్‌గా తన టాలెంట్ చూపించాడు. ఈ చిత్రంలో ‘కుట్టీ స్టోరీ’ పాట విడుదల చేసారు. ఇంతకు ముందు అనిరుథ్..ధనుశ్ హీరోగా ‘త్రీ’ కోసం వై దిస్ కొలవెరి పాట కూడా ఎక్కువగా ఇంగ్లీష్ పదాలత, భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు అర్థమయ్యేలా సాగింది. తమిళంలో ‘లెట్ మి సింగ్ ఎ కుట్టీ స్టోరీ’ అంటూ విజయ్ పాడిన పాట ట్రెండింగ్‌లో ఉంది. తెలుగులో వెర్షన్ కోసం ఎన్టీఆర్‌తో పాట పాడించడానికి దర్శక,నిర్మాతలు ప్రయత్నాలు మొదలుపెట్టారట. అంతేకాదు ఎన్టీఆర్‌ను కలిసి ఈ పాట పాడమని రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. తారక్ కూడా ఈ పాట పాడటానికి ఓకే చెప్పినట్టు సమాచారం. గతంలో ఎన్టీఆర్ కూడా కన్నడలో పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన ‘చక్రవ్యూహ’లో గెలియా గెలియా పాట పాడిన సంగతి తెలిసందే కదా. ఈ పాట అప్పట్లో పెద్ద హిట్టైయిన సంగతి తెలిసిందే కదా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jr ntr, Lokesh Kanagaraj, Master, RRR, SS Rajamouli, Telugu Cinema, Tollywood, Vijay