హీరోగా జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలతో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసాడు. అంతేకాదు తన దగ్గరకు వచ్చిన వాటిలో రిజెక్ట్ చేసిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. అలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన స్టోరీలతో వేరే కథానాయకులు జబర్దస్త్ హిట్స్ అందుకున్నారు. ఈ రకంగా జూనియర్ రిజెక్ట్ చేసిన సినిమాల వివరాల్లోకి వెళితే.. ‘అరవింద సమేత వీర రాఘవ’సినిమాతో హీరోగా 28 సినిమాలు కంప్లీట్ చేసుకున్న ఎన్టీఆర్..ఇపుడు రాజమౌళి దర్శకత్వంలో 29వ సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఉగాది సందర్భంగా విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ సంగతి పక్కనపెడితే.. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన స్టోరీల విషయానికొస్తే..నాగార్జున, కార్తి కాంబినేషన్ల వచ్చిన ‘ఊపిరి’ చిత్రంలో ముందుగా కార్తి ప్లేస్‌లో ఎన్టీఆర్‌నే అనుకున్నారు. ముందుగా ఈ సినిమా చేయడానికి ఎన్టీఆర్ ఓకే చెప్పినా..ఈ చిత్రంలో ఓ సీన్లో నాగార్జున కాళ్లు పట్టుకునే సన్నివేశాలు ఉండటం. అలా కాళ్లు పట్టుకునే పాత్ర చేస్తే అభిమానులు గోల చేస్తారనే భయంతో ఈ సినిమాను రిజెక్ట్ చేసాడు తారక్. అంతేకాదు ఎన్టీఆర్ ప్లేస్‌లో కార్తి ఆ క్యారెక్టర్ చేసి.. ఆ పాత్రకు ఆయన తప్పించి వేరే ఎవరు సూట్ కానంతగా నటించి మెప్పించాడు.
ఒక్క ‘ఊపిరి’ సినిమావిషయంలనే కాదు...ఎన్టీఆర్...అన్న కళ్యాణ్ రామ్ హీరోగా ఫస్ట్ హిట్ అందుకున్న ‘అతనొక్కడే’ స్టోరీని ముందుగా డైరెక్టర్ సురేందర్ రెడ్డి...జూనియర్‌ను దృష్టిలో పెట్టుకునే కత రెడీ చేసుకున్నాడట.ఆ తర్వాత ఏమైందో ఏమో...ఆ చిత్రాన్ని సురేందర్ రెడ్డి... ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్‌తో తెరకెక్కించి అతనికో మెమరబుల్ హిట్ అందించాడు.
అతనొక్కడే చిత్ర విషయంలోనే కాదు...ఆర్య సినిమాను కూడా ఈ రకంగానే ఎన్టీఆర్ వద్దన్నడట. వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన సుకుమార్...‘ఆర్య’ వంటి డిఫరెంట్ స్టోరీని ముందుగా తారక్ కే వినిపించాడు.ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్...ఆయన ఇమేజ్ తగ్గ కథ కాదని ఈ సినిమాలో హీరోగా యాక్ట్ చేయనని చెప్పడంతో ఈ సినిమా అల్లు అర్జున్‌కి దగ్గరకి వెళ్లింది. ఇక ‘ఆర్య’ సినిమా బన్ని కెరీర్ నే పెద్ద మలుపు తిప్పింది. అలాగే రవితేజ చేసిన ‘కిక్’, ‘భద్ర’, ‘కృష్ణ’ సినిమాలు కూడా ఎన్టీఆర్ వద్దనుకున్న తర్వాతనే మాస్ రాజా దగ్గరకి వెళ్లాయి. ఈ సినిమాలు రవితేజ కెరీర్‌కు మంచి హెల్ప్ అయిన సంగతి తెలిసిందే కదా.
ఇక ఎన్టీఆర్‌కు ‘ఆది’ సినిమాతో మాస్ ఇమేజ్ క్రియేట్ చేసిన వినాయక్...ఆ తర్వాత నితిన్‌తో ‘దిల్’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. ముందుగా ఈ స్టోరీ జూనియర్ ఎన్టీఆర్‌నే హీరోగా అనుకున్నారు. కానీ యంగ్ టైగర్ ఈ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేయడంతో ఆ చిత్రాన్ని నితిన్‌ను హీరోగా పెట్టి వినాయక్ తెరకెక్కించాడు. అలాగే మహేశ్ బాబును ‘శ్రీమంతుడు’గా చూపెట్టి డైరెక్టర్‌గా మంచి పేరు సంపాదించుకున్న కొరటాల శివ...ముందు ఈ స్టోరీని ఎన్టీఆర్‌ను దృష్టిలో పెట్టుకునే రెడీ చేసాడట. ఇక జూనియర్ కూడా చేద్దాం...చూద్దాం అంటూ ఈ ప్రాజెక్ట్ ను డిలే చేయడంతోని..ఫైనల్ గా కొరటాల శివ మహేష్ బాబుతో ఈ సినిమాను తెరకెక్కించాడు.
మరోవైపు మహేశ్ బాబు కెరీర్లనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా స్టోరీని డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల...ముందుగా తారక్‌ను కలిసి ఈ కథ వినిపించాడట. ఈ స్టోరీ తన ఇమేజ్ కు సెట్ కాదని చెప్పడంతో ఫైనల్‌గా మహేష్ బాబును ఒప్పించాడు శ్రీకాంత్ అడ్డా. ఒక్క ‘బ్రహ్మోత్సవం’ తప్పించి ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు వేరే కథానాయకుల అదృష్టాన్ని ఛేంజ్ చేసాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Jr ntr, Kalyan Ram Nandamuri, Mahesh babu, Raviteja, RRR, Tollywood