Ajay Devgn -Bhuj - OTT Release : గతేడాది కరోనా మహామ్మారి కారణంగా ఏర్పడ్డ లాక్‌డౌన్‌తో సినిమా షూటింగ్స్ అన్ని రద్దు అయ్యాయి. మరోవైపు థియేటర్స్ కూడా మూత పడ్డాయి. దీంతో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీస్ వాల్లు తమ సినిమాలను ఓటీటీ వేదికగా విడుదల చేసారు. మరి కొంత మంది మాత్రం వేచి చూసి థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నారు. ఇక బాలీవుడ్‌లో గతేడాది విడుదల కావాల్సిన ‘సూర్య వంశీ’, ‘83’ వంటి సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కోసమే వెయిట్ చేస్తున్నాయి. ఇక అక్షయ్ కుమార్ నటించిన ‘లక్ష్మీ’ సినిమా కూడా హాట్ స్టార్ ఓటీటీ వేదికగా విడుదలైంది. తాజాగా అజయ్ దేవ్‌గణ్ ప్రధాన పాత్రలో సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, ప్రధాన పాత్రలో నటించిన ‘భుజ్’ సినిమాను హాట్ స్టార్‌కు సంబంధించిన ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఆగష్టు 13న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు అజయ్ దేవ్‌గణ్ ప్రకటించారు.
1971లో జరిగిన భారత్ - బంగ్లాదేశ్ యుద్ధ నేపథ్యంలో జరిగిన నిజ జీవిత ఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ మరోసారి ఎయిర్‌ఫోర్స్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. అభిషేక్ దుదియా దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో ప్రణీత సుభాష్, శరత్ ఖేల్‌కర్ కూడా ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.