Ajay Devgn - Sudeep : భారత దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం.. ఇక్కడ ప్రజలు ఎన్ని భాషలు మాట్లాడినా.. దేశం విషయం వచ్చేసరికి అంతా ఒక్కటే అన్నది భారతీయుల భావన. వివిధ దేశాల్లో ఎన్ని భాషలు మాట్లాడిన వారి జాతిని గుర్తించేందకు ఒక అధికార భాష అంటూ ఉంటోంది. ఇక తెలుగు విషయానికొస్తే.. ఇక్కడ తెలంగాణలోనే వివిధ మాండలికాలున్నాయి. ఉత్తర తెలంగాణలో ఒక రకంగా మాట్లాడితే.. దక్షిణ తెలంగాణ మరో రకంగా ఉంటోంది. అటు హైదరాబాద్ సంగతి సరేసరి. ఒక ఆంధ్ర ప్రదేశ్‌లో తిరుపతి, చిత్తూరు, నెల్లూరు యాసలు ఒక రకంగా ఉంటే.. గుంటూరు, కృష్ణా జిల్లాల యాస వేరే రకంగా ఉంటోంది. అటు శ్రీకాకుళం, విజయ నగరం నుంచి మొదలు పెడితే.. రాయలసీమ వరకు తెలుగు మాట్లాడే ప్రాంతాల్లోనే వివిధ యాసలున్నాయి. అయినా అందరు తెలుగు వాళ్లే.
ఇక భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు.. భాషలున్నాయి. వేటి ప్రత్యేకత వాటిదే. కానీ మన దేశంలో అధికార భాష విషయానికొస్తే.. హిందీనే ఎక్కువ మంది మాట్లాడుతారు. ఇందులో వివిధ ప్రాంతాలు, యాసలున్నాయి. తాజాగా హీరో సుదీప్.. హిందీ ఇకపై జాతీయ భాష కాదు అన్న వ్యాఖ్యలు ఇపుడు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. దీనికి బాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్ఆర్ఆర్ హీరో అజయ్ దేవ్‌గణ్ అంతే స్థాయిలో స్పందించారు.
గత కొన్ని రోజులు సౌత్ సినిమాలు నార్త్ రీజియన్‌లో ఇరగదీస్తున్నాయి. ‘పుష్ప’, ఆర్ఆర్ఆర్’, కేజీఎఫ్ 2 సినిమాలు హిందీ సినీ హీరోలకు చుక్కలు చూపిస్తున్నాయి. అక్కడ ఒరిజినల్ సినిమాలంటే ఎక్కువ వసూళ్లను సాధిస్తున్నాయి. యశ్ హీరోగా నటించిన కన్నడ డబ్బింగ్ మూవీ హిందీలో ఏకంగా రూ. 350 కోట్లు వసూళ్లు చేసి బాలీవుడ్ ట్రేడ్ పండితులను ఆశ్యర్యపోయేలా చేసింది. తాజాగా సుదీప్.. రామ్ గోపాల్ వర్మ.. ఉపేంద్ర హీరోగా ‘ఆర్.. ‘ది డెడ్లీయస్ట్ గ్యాంగ్‌స్టర్’ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఛీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. బాలీవుడ్ వాళ్లు తమ సినిమాలను ప్రాంతీయ భాషల్లో డబ్ చేసి సక్సెస్ అందుకోవడానికి కిందా మీదా అవుతున్నారు. అయినా.. సక్సెస్ మాత్రం ఎండమావే అవుతోంది. కానీ దక్షిణాది సినిమాలు మాత్రం ఎక్కడైనా సత్తా చూపుతున్నాయంటూ తాజాగా హిందీలో వసూళ్ల వర్షం కురిపిస్తోన్న ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 సినిమాలను ప్రస్తావించారు. అంతేకాదు ఇకపై హిందీ జాతీయ భాష కాదు అంటూ కామెంట్స్ చేయడం పై వివాదం రాజుకుంది. సుదీప్ వ్యాఖ్యలపై చాలా మంది సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోస్తున్నారు.
.@KicchaSudeep मेरे भाई,
आपके अनुसार अगर हिंदी हमारी राष्ट्रीय भाषा नहीं है तो आप अपनी मातृभाषा की फ़िल्मों को हिंदी में डब करके क्यूँ रिलीज़ करते हैं?
हिंदी हमारी मातृभाषा और राष्ट्रीय भाषा थी, है और हमेशा रहेगी।
जन गण मन ।
దీనికి ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ తండ్రి పాత్రలో నటించిన అజయ్ దేవ్‌గణ్ స్పందిస్తూ.. ఓ ట్వీట్‌ను సుదీప్‌కు ట్యాగ్ చేశారు. హిందీ జాతీయ భాష కాకపోతే.. తన మాతృభాష చిత్రాలను హిందీలో డబ్ ఎందుకు చేస్తున్నాంటూ అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. డియర్ బ్రదర్ కిచ్చా సుదీప్.. హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాకపోతే.. మీ భాష సినిమాలను ఎందుకు హిందీలో డబ్ చేస్తున్నారు.
Hi @KicchaSudeep, You are a friend. thanks for clearing up the misunderstanding. I’ve always thought of the film industry as one. We respect all languages and we expect everyone to respect our language as well. Perhaps, something was lost in translation 🙏
హిందీ ఇప్పటికీ, ఎప్పటికీ మన మాతృభాష .. భారతీయులను కలిపి ఉంచే జాతీయ భాష. జన గణ మణ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై సుదీప్ ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఏమైనా జాతీయ స్థాయిలో హిందీని అధికార భాషగా ఒప్పుకోక తప్పదు. ఏమైనా సుదీప్ జాతీయ భాష హిందీపై ఇలాంటి రెచ్చగొట్టే తరహా మాటలు మాట్లాడటం పై ఇపుడిపుడే ప్యాన్ ఇండియా స్టార్స్‌గా ఎదుగుతున్న హీరోలు ఎలా స్పందిస్తారనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.