RRR : ఆర్ఆర్ఆర్ రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. తాజాగా ఈ సినిమా లవర్స్‌కు అదిరిపోయే శుభవార్త.
RRR : ఆర్ఆర్ఆర్రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ కోసం అభిమానులు నాలుగేళ్లకు పైగా వెయిట్ చేశారు. ఎన్టీఆర్,రామ్ చరణ్ (Jr NTR, Ram Charan) వంటి అగ్ర హీరోలు కలిసి నటించిన ఈ సినిమా అనుకున్నట్టే మొదటి రోజు వసూళ్లను రాబట్టింది.ఈ సినిమా అనుకున్నట్టే భారీగా మొదటి రోజు వసూళ్లను రాబట్టి దాదాపు అదే జోరు కంటిన్యూ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర ఒక్కో రికార్డును స్మాష్ చేస్తూ వెళుతోంది. వీక్ డేస్‌లో బాక్సాఫీస్ రేసులో వెనకబడ్డ ఈ సినిమా .. ఓవరాల్‌గా వీకెండ్లో ఉగాదితో పాటు ఆది వారం ఈ సినిమా బాగానే క్యాష్ చేసుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారతీయ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది. ఇక ఈ సినిమాను మేకర్స్.. ఐమాక్స్, 3D, డాల్బీ ఫార్మాట్లో రిలీజ్ చేసారు. ఇక డాల్బీ విడుదలైన మొదటి భారతీయ చిత్రంగా ఆర్ఆర్ఆర్ రికార్డులకు ఎక్కింది.
ఆలియా భట్, ఒలివియా మోరీస్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా ఓవరాల్‌గా నైజాంలో ఆరో బ్రేక్ ఈవెన్ పూర్తైయింది. దాంతో ఓవరాల్‌గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమా తెలంగాణలో రూ. 100 కోట్ల షేర్‌కు దగ్గరగా ఉంది. సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ రికార్డ్ బ్రేక్ చేయడం ఇంకా కొన్నేళ్లు పట్టేలా ఉంది. తాజాగా ఈ సినిమా అభిమానులకు మరో శుభవార్త. ఈ రోజు నుంచి తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌లో నార్మల్ రేట్స్ అందుబాటులోకి వచ్చాయి.
రిలీజైన రోజు నుంచి ఎక్కువ రేట్స్‌తో అమ్మారు. కొందరు మాత్రం ఇది ప్రేక్షకుల జేబులకు రాజమౌళి చిల్లు పెట్టాడని చెబతున్నా.. ప్రేక్షకులు ఈ సినిమాను ఎలాగైనా చూడాలనే ఆసక్తితో స్వచ్ఛందంగా ఆర్ఆర్ఆర్ సినిమాను చూస్తున్నారు. మధ్య తరగతి కుటుంబలు ఈ సినిమా రేట్స్ ఎక్కువగా ఉండటంతో థియేటర్స్ వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోయారు. పది రోజుల తర్వాత చూద్దాంలే అన్నట్టు ఆగారు. 10 రోజుల గడువు నిన్నటితో ముగిసింది. దీనికి తోడు రోజు ఐదు షోలు వేసుకోవడానికి ఉభయ రాష్ట్రాలు ప్రత్యేకంగా అనుమతులు కూడా ఇచ్చాయి. ఈ రోజు నుంచి తక్కువ రేటు అమల్లోకి రావడంతో రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మరోసారి తక్కువ రేటుతో ఈ సినిమా చూడొచ్చన్న ఆనందంతో లుంగీ డాన్స్ చేస్తున్నారు.
ఈ రోజు నుంచి తెలంగాణలో సింగిల్ స్క్రీన్‌లో 175 రపాయలు.. మల్టీప్లెక్స్‌లో రూ. 295 మాక్సిమమ్ ప్రైస్ ఉంది. ఏపీ విషయానికొస్తే.. అక్కడ సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 145, మల్టీప్లెక్స్‌లో రూ. 177 ఉంది. ఇక రీక్లెయినర్ సీట్లు అదనంగా మరింత చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఇప్పటి వరకు టిక్కెట్ రేట్స్ హైక్ కారణంగా ఈ సినిమా చూడలేకపోయిన కుటుంబ ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ ఈ సినిమా చూడడానికి థియేటర్స్‌కు క్యూ కట్టే అవకాశాలున్నాయి. మొత్తంగా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓవరాల్‌గా ఎంత కలెక్షన్లు కొల్లగొడుతుందో చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.