RRR OTT : RRR OTT : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాను పే ఫర్ వ్యూ పద్థతిన స్ట్రీమింగ్ చేస్తున్నట్టు ప్రకటించినా... తాజాగా ప్రేక్షకుల నుంచి వచ్చిన నిరసన కారణంగా ఈ సినిమాను సబ్‌స్క్రైబర్స్‌కు మాములు పద్ధతిలో స్ట్రీమింగ్‌లో చూడొచ్చు అంటూ ప్రకటించారు.
RRR OTT : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందింది. తాజాగా ఈ సినిమాను ఈ శుక్రవారం నుంచి ఈ సినిమా జీ 5లో పే ఫర్ వ్యూ పద్దతిన స్ట్రీమింగ్ చేయనున్నట్టు ప్రకటించారు. దీనిపై సబ్స్క్రైబర్స్ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయడంతో జీ5 వెనక్కి తగ్గింది. ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్లకు ఎప్పటిలాగా ఎక్స్ట్రా మనీ లేకుండా ఈ సినిమాను చూడొచ్చు అంటూ చెప్పుకొచ్చింది. కొత్తగా సబ్స్క్రిప్షన్ తీసుకునేవాళ్లకు మాత్రమే ఎక్స్ట్రా 100 రూపాయలు పే చేస్తే కానీ ఈ సినిమా చూడలేరంటూ ప్రకటించింది. మొత్తంగా హిందీ తప్ప అన్ని భాషలకు చెందిన ఆర్ఆర్ఆర్ స్ట్రీమింగ్కు సబ్స్క్రైబర్స్ ఎక్స్ట్రా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదంటూ అఫీషియల్ ప్రకటన విడుదల చేశారు.
రీసెంట్గా అమెజాన్ ప్రైమ్‌లో కేజీఎఫ్ ఛాప్టర్ 2 మూవీని రూ. 199 కి పే ఫర్ వ్యూ పద్దతిన స్ట్రీమింగ్కు పెడితే.. అంతగా రెస్పాన్స్ రాలేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో అమెజాన్ ప్రైమ్ వాళ్లు ఈ సినిమాను త్వరలో సబ్‌స్క్రైబర్స్‌కు ఎక్స్ట్రా మనీ లేకుండా స్ట్రీమింగ్ పెట్టనున్నట్టు సమాచారం.
A good day indeed, as #ZEE5 Premium Subscribers can watch the World Digital Premiere for FREE from May 20th
Re-experience the roar, only on 4K Ultra HD!
Note: The best update from the roaring film!
ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే.. ఈ మూవీ రీసెంట్గా 50 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా తెలుగులో పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1150 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఆర్ఆర్ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్లో అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 14 మిలియన్ డాలర్స్‌పైగా వసూలు చేసి రూ. 100 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది. అయితే అమెరికాలో ఈ ఫీట్ సాథించిన మరో సినిమా బాహుబలి 2 (Bahubali).. ఇండియా నుంచి ఈ రెండు సినిమాలు అమెరికాలో 100 కోట్ల గ్రాస్‌ను అందుకున్నాయి.
ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ రెండు సినిమాలు కూడా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చినవే. ఆర్ ఆర్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రూ. 451 కోట్ల బిజినెస్ చేయగా... 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించి ఈ సినిమా ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన హిందీ డిజిటల్ ప్రీమియర్‌ను జూన్ 2 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. దానికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేశారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.