RRR NTR | ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘రౌద్రం రణం రుధిరం’ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మరో హీరోగా నటిస్తున్నాడు. కాల్పనిక స్వాతంత్య్ర పోరాట నేపథ్యంలో విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కథను రెడీ చేసాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ కథను కీలక మలుపు తిప్పే పాత్రలో నటించబోతున్నట్టు ఇప్పటికే రాజమౌళి తెలియజేసారు. ఇక తెలుగు తెరపై చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు బడా మాస్ హీరోలు కలిసి నటిస్తోన్న అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇది. ఈ చిత్రం పై తెలుగు ఇండస్ట్రీలో చాలా అంచనాలు ఉన్నాయి. పైగా బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో అంచనాలున్నాయి. ఆర్ఆర్ఆర్ షూటింగ్ రేపటి (సోమవారం) నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో రాజమౌళి ప్రారంభించనున్నాడు.
ఎన్టీఆర్, రాజమౌళి (File/Photo)
ఐతే.. రేపటి నుండి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో ఎన్టీఆర్ జాయిన్ కానున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్లో కేవలం ఎన్టీఆర్ మీద చిత్రీకరించనున్నట్టు సమాచారం. ఆర్ఆర్ఆర్లో ఇప్పటికే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ గెటప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ పుట్టినరోజుకు ఏదైనా టీజర్ వస్తుందని ఆశించిన ప్రేక్షకులకు మాత్రం నిరాశే మిగిలింది. అప్పటికే దేశంలో లాక్డౌన్ ప్రకటించడంతో తారక్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయలేకపోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకే ఈ సారి తారక్‌కు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయాలనే పట్టుదలతో రాజమౌళి ఉన్నట్టు సమాచారం.
ఈ సినిమాకు తెలుగులో రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ఖరారు చేసారు. ఈ సినిమాలో ఇప్పటికే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ గెటప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.మొత్తంగా ఎన్ని రోజులుగా కొమరం భీమ్‌గా తారక్‌ను చూడాలనుకున్న అభిమానులు కల త్వరలో నెరవేరబోతున్నదన్నమాట.