RRR FAME RAM CHARAN ANOTHER RECORD IN SOCIAL MEDIA HIS CROSS 5 MILLION FOLLOWERS IN INSTAGRAM TA
Ram Charan : రామ్ చరణ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. RRR విడుదలకు ముందే మెగా పవర్ స్టార్ మరో ఘనత..
రామ్ చరణ్ (Twitter/Photo)
Ram Charan : రామ్ చరణ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. RRR (రౌద్రం రణం రుధిరం) విడుదలకు ముందే మెగా పవర్ స్టార్ మరో ఘనత సాధించడంతో మెగాభిమానులు పండగ చేసుకుంటున్నారు.
Ram Charan : రామ్ చరణ్ ఖాతాలో మరో అరుదైన రికార్డు.. RRR (రౌద్రం రణం రుధిరం) విడుదలకు ముందే మెగా పవర్ స్టార్ మరో ఘనత సాధించడంతో మెగాభిమానులు పండగ చేసుకుంటున్నారు. మిగిలిన హీరోలతో పోలిస్తే.. సోషల్ మీడియాలో లేట్‌గా ఎంట్రీ ఇచ్చినా.. లేటెస్ట్గా ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇవ్వక ముందు.. తన మూవీకి సంబంధించిన విషయాలను ఫేస్బుక్లో షేర్ చేసుకునే వారు. లేకపోతే.. తన భార్య ఉపాసనకు సంబంధించిన సోషల్ మీడియా పేజ్‌లో తనకు సంబంధించిన విషయాలను పంచుకునేవారు. జూలై 8న 2019లో ఇన్‌స్టాగ్రామ్‌లో అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఒకటిన్నర యేడాదిలో ఈయన ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య 5 లక్షలు క్రాస్ అయింది.
ప్రస్తుతం రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కంప్లీట్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే యేడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఓమైక్రాన్ వేరియంట్ కేసులు ఎక్కువ కావడంతో ఈ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఈ సినిమాపై బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. మరోవైపు రామ్ చరణ్ .. తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘ఆచార్య’ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఆ డేట్లో విడుదలవుతుందో లేదో చూడాలి.
ఇక రామ్ చరణ్ శంకర్‌తో చేయబోయే సినిమా వివరాల్లోకి వెళితే.. ఈ సినిమాను శంకర్ (Shankar) పరిమిత బడ్జెట్లో తెరకెక్కిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాను శంకర్.. ఈ సినిమాను శంకర్ దేశ చట్టాలను ఉపయోగించుకొని కార్పోరేట్ శక్తులు ఏ విధంగా ఎదుగుతున్నాయో తన సినిమాలో చూపించనున్నట్టు సమాచారం. రామ్ చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. ఇండియన్ పీనల్ కోడ్‌లోని ఇప్పటి వరకు ఎవరు టచ్ చేయని పలు సెక్షన్లను శంకర్ ఈ సినిమాలో ప్రస్తావించనున్నట్టు సమాచారం.
సినిమాను కూడా శంకర్ తనదైన శైలిలో సోషల్ మెసెజ్‌తో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా అర్జున్ నటించిన ‘ఒకే ఒక్కడు’ సినిమాకు సీక్వెల్ అనే సమాచారం జరుగుతోంది.అందులో జర్నలిస్ట్ నుంచి ముఖ్యమంత్రి అయితే... ఇందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర నుంచి సీఎం స్థాయికి ఎదిగే పాత్ర ఉంటుందనేది కోలీవుడ్ (Kollywood) సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇదే స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా లేదా తెలియాల్సి ఉంది.
మరోవైపు రామ్ చరణ్.. ప్రభాస్‌కు చెందిన యూవీ క్రియేషన్స్ బ్యానర్లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇప్పటికే దసరా సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. త్వరలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను స్పోర్ట్స్ నేపథ్యంలో ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.