అసలు ఎన్టీఆర్‌కు ఏమైంది.. ఎందుకిలా అయ్యాడు..

టాలీవుడ్‌లో నందమూరి ఫ్యామిలీ ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని తెలుగు అగ్ర కథానాయకుడిగా టాలీవుడ్‌లో తన రభస కొనసాగిస్తునే ఉన్నాడు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులను కలిసిన సందర్భంగా ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

news18-telugu
Updated: January 3, 2020, 12:18 PM IST
అసలు ఎన్టీఆర్‌కు ఏమైంది.. ఎందుకిలా అయ్యాడు..
న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులకు ఎన్టీఆర్ అభివాదం (Twitter/Photo)
  • Share this:
టాలీవుడ్‌లో నందమూరి ఫ్యామిలీ ట్యాగ్‌తో ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని తెలుగు అగ్ర కథానాయకుడిగా టాలీవుడ్‌లో తన రభస కొనసాగిస్తునే ఉన్నాడు. అంతేకాదు తనదైన డాన్స్, ఫైట్స్‌తో కోట్లాది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక ‘టెంపర్’ నుంచి అపజయం అంటూ ఎరగని జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్‌తో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో తారక్.. కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ ఇయర్ దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రేమికులు  ఈ చిత్రం కోసమే ఎదురు చూస్తున్నారు. ఐతే.. గత కొన్నేళ్లుగా చేసే ప్రతి చిత్రంలో తనకు తాను కొత్తగా కనిపిస్తు్నాడు.  ప్రస్తుతం జక్కన్న దర్శకత్వంలో చేస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ కోసం ప్రత్యేకమైన లుక్‌లో కనిపించనున్నాడు.  తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఎన్టీఆర్‌ను కలిసి ఆయనకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పాలని చాలా మంది అభిమానులు తారక్ ఇంటికి పోటెత్తారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బయటకు వచ్చి అభిమానులకు అభివాదం చేసాడు.

rrr fame jr ntr new look go viral on social media,jr ntr,rrr,jr ntr new look,jr ntr very weak,rrr jr ntr ram charan rajamouli,ss rajamouli,jr ntr ram charan lady fan,jr ntr twitter,ram charan instagram,jr ntr instagram,ram charan twitter,jr ntr facebook,ram charan facebook,rrr twitter,rajamouli facebook,rajamouli twitter,rajamouli instagram,rrr instagram,rrr updates,rrr facebook,bollywood,tollywood,telugu cinema,tarak,cherry,జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్,తారక్,జూ ఎన్టీఆర్ చెర్రీ,రాజమౌళి ఎన్టీఆర్ రామ్ చరణ్,జూనియర్ ఎన్టీఆర్ న్యూ లుక్
న్యూ ఇయర్ సందర్భంగా అభిమానులతో ఎన్టీఆర్ అభివాదరం (Twitter/Photo)


ఈ సందర్భంగా తారక్ బక్క పల్చగా.. బలహీనంగా ఉన్న లుక్ చూసి అభిమానులు ఒకింత ఆశ్చర్యానికి లోనైయ్యారు. ఈ సందర్భంగా  కొంత మంది అభిమానులు.. జూనియర్ ఎన్టీఆర్‌ను ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. అవి కాస్తా వైరల్ అయ్యాయి. కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ ఫోటోలు చూసి కంగారు పడుతూ... సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. అన్న ఏమైందే.. ఎందుకు ఇట్ల తయారైనావు అంటూ కామెంట్స్ పెట్టారు. కొందరు బాగా వీక్ అయ్యావు అని కామెంట్స్ చేస్తే.. మరికొందరు ఎన్టీఆర్‌కు ఆరోగ్యం బాగాలేదా ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఏం ఆందోళన చెందాల్సిన పనిలేదు.. అన్న కొత్త సినిమా కోసం సరికొత్త లుక్‌లో కనిపించనీకి ఇలా తయారయ్యాడని ఎన్టీఆర్ లుక్‌పై రకరకాలు కామెంట్స్ చేస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: January 3, 2020, 12:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading