RRR FAME JR NTR KGF 2 PRASHANTH NEEL CELEBRATES WEDDING ANNIVERSARIES TOGETHER TA
Jr NTR - Prashanth Neel : కేజీఎఫ్ డైరెక్టర్ ఆర్ఆర్ఆర్ హీరో కలిసిన వేళ.. ప్రశాంత్ నీల్‌కు ఎన్టీఆర్ స్పెషల్ పార్టీ..
కేజీఎఫ్ 2 డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు ఎన్టీఆర్ స్పెషల్ పార్టీ (Instagram/Photo)
Jr NTR - Prashanth Neel : కేజీఎఫ్ డైరెక్టర్‌కు ప్రశాంత్ నీల్‌కు ఎన్టీఆర్ స్పెషల్ పార్టీ ఇచ్చారు. దానికి సంబంధించిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు.
Jr NTR - Prashanth Neel : కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు ఎన్టీఆర్ స్పెషల్ పార్టీ ఇచ్చారు. ఈ యేడాది ఎన్టీఆర్‌కు స్పెషల్ అని చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ సినిమాలో తొలిసారి రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మరోవైపు ఆర్ఆర్ఆర్ విడుదలైన 3 వారాల్లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 మంచి విజయం సాధించింది. ఈ సినిమా హిందీలో ఆర్ఆర్ఆర్ను మించి వసూళ్లను సాధించింది. ఈ సినిమా దాదాపు 1100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మరోవైపు ఆర్ఆర్ఆర్ కూడా రూ. 1150 కోట్ల గ్రాస్ వసూళ్లతో ప్రస్తుతానికి 2022లో టాప్ హైయ్యెస్ట్ గ్రాసర్‌గా ఉంది. త్వరలో కేజీఎఫ్ 2.. ఆర్ఆర్ఆర్ కలెక్షన్స్‌ను దాటే అవకాశాలున్నాయి.
తాజాగా ఆర్ఆర్ఆర్ హీరో ఎన్టీఆర్.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కు స్పెషల్ పార్టీ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇద్దరిది మే 5 న మ్యారేజ్ డే కావడంతో ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ స్పెషల్ పార్టీ ఇచ్చారు. వీళ్లిద్దరు వాళ్లు సతీమణిలతో దిగిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.
ఇక వీళ్లిద్దరు కలిసి త్వరలో ఓ సినిమా చేయనున్నారు. ప్రభాస్‌తో సలార్ మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ లోపు ఎన్టీఆర్ .. కొరటాల శివ సినిమా తర్వాత ఈ సినిమా సెట్స్ పెకి వెళ్లనుంది. ఇక రాజమౌళి దర్శకత్వంలో చేసిన ఆర్ఆర్ఆర్ మూవీతో కెరీర్లో తొలిసారి వరుసగా ఆరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు ఎన్టీఆర్. ఈ రకంగా ఈ జనరేషన్లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలెవరు వరుసగా ఆరు సక్సెస్‌లు అందుకోలేదు. ఇక ఈ ఫీట్ అందుకున్న హీరోల్లో నాని ఉన్నారు. కానీ అతను స్టార్ హీరో కాకుండా .. మీడియం రేంజ్ హీరోగా దూసుకుపోతున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 1150 కోట్ల గ్రాస్ వసూళ్లతో పాటు రూ. 600 కోట్ల షేర్ దాకా రాబట్టింది.
మొత్తంగా ఎన్టీఆర్ తన కెరీర్లో తొలిసారి వరుసగా ఆరు హిట్స్‌తో డబుల్ హాట్రిక్ నమోదు చేశారు. అది కూడా తనకిష్టమైన దర్శకుడు రాజమౌళి డైరెక్షన్లో ఈ అరుదైన ఫీట్ అందుకోవడంపై ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ వరుసగా కొరటాల శివ, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు వంటి డైరెక్టర్స్‌ను లైన్లో పెట్టారు. తాజాగా హనుమాన్ దీక్షతో మరోసారి వార్తల్లో నిలిచారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి వివాహబంధం లోకి అడుగుపెట్టి ఈరోజుతో పదకొండేళ్లు అవుతోంది. వీరి వివాహం కుటుంబ సభ్యులు మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. వీరి పెళ్లి మే 5, 2011లో అత్యంత వైభవంగా జరిగింది. ఈరోజు పెళ్లి రోజు కావడంతో సోషల్ మీడియాలో తారక్ ప్రణతిలకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. తారక్ ప్రణితిలకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడి పేరు అభయ్ రామ్.. చిన్న కుమారుడి పేరు భార్గవ్ రామ్. ఇక ఎన్టీఆర్ ఓ వైపు సినిమాలను మరోవైపు వైవాహిక జీవితాన్ని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.