Ajay Devgn - Runway 34 Trailer Talk : బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ నటిస్తూ, నిర్మిస్తూ.. దర్శకత్వం వహించిన చిత్రం ‘రన్ వే 34’. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) మరో కీలక పాత్రలో నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh)కథానాయికగా నటించింది. ‘దే దే ప్యార్ దే’ సినిమా తర్వాత అజయ్ దేవ్‌గణ్, రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి కలిసి నటించారు. ఈ సినిమాకు ముందుగా మే డే (My Day )అనే టైటిల్‌తో చిత్రీకరించారు. ఆ తర్వాత ‘రన్‌వే 34’ టైటిల్ ఖరారు చేశారు. గతంలో ‘యూ మీ ఔర్ హమ్’ ‘శివాయ్’ వంటి ఒకటి రెండు చిత్రాలను డైరెక్ట్ చేశారు. తాజాగా ‘రన్‌వే 34’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్నారు.
‘రన్‌వే 34’ మూవీని నిజ జీవిత ఘటనల ఆధారంగా సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు.యాక్షన్ అండ్ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈద్ కానుకగా ఏప్రిల్ 29న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసారు.
AMITABH - AJAY DEVGN: 'RUNWAY 34' TRAILER ARRIVES... Here's #Runway34Trailer, featuring #AmitabhBachchan, #AjayDevgn, #RakulPreetSingh and #BomanIrani... #Runway34 is directed by #AjayDevgn... Link: https://t.co/lw2X19rZiC pic.twitter.com/QQJPhPX8CX
— taran adarsh (@taran_adarsh) March 21, 2022
ఈ ట్రైలర్ థ్రిల్లింగ్ మూమెంట్స్‌తో ఆసక్తిగొలిపేలా ఉంది. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్ విమాన పైలెట్‌గా నటించారు. అతని కో పైలెట్‌గా రకుల్ ప్రీత్ సింగ్ యాక్ట్ చేసింది. హీరో నడిపే విమానం అనుకోని ప్రమాదానికి గురవుతోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం అనుకోకుండా జరిగిందా.. లేకపోతే ఎవరి ప్రోద్బలంతోనైనా ఈ ప్రమాదానికి బాధ్యులా అనే యాంగిల్లో సాగుతోంది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పాత్రలో అమితాబ్ బచ్చన్ నటించారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమాను అజయ్ దేవ్‌గణ్ తెరకెక్కించారు.
అజయ్ దేవ్‌గణ్ ఇతర చిత్రాల విషయానికొస్తే.. గతేడాది ఈయన హీరోగా నటించిన ‘భుజ్’ చిత్రాన్ని గతేడాది హాట్ స్టార్ ఓటీటీ వేదికగా విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. 1971లో జరిగిన భారత్ - బంగ్లాదేశ్ యుద్ధ నేపథ్యంలో జరిగిన నిజ జీవిత ఘటనల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కింది. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ ఎయిర్‌ఫోర్స్ అధికారి పాత్రలో నటించారు. అభిషేక్ దుదియా దర్శకత్వంలో వహించిన ఈ సినిమాలో ప్రణీత సుభాష్, సంజయ్ దత్, శరత్ ఖేల్కర్ కూడా ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.మరోవైపు ఈయన అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘సూర్యవంశీ’లో సింగం పాత్రలో తళుక్కున మెరిసారు.
ఈ యేడాది ఆలియా భట్ ముఖ్యపాత్రలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘గంగూబాయి కఠియావాడి’ సినిమాలో కరీమ్ లాలాగా అతిథి పాత్రలో మెరిసారు. మరోవైపు ఈయన ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ రౌద్రం రణం రుధిరం’ సినిమాలో కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ క్యారెక్టర్ పై బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో భారీ అంచాలనే ఉన్నాయి. మరోవైపు ఈయన హీరోగా నటించిన ‘మైదాన్’ సినిమా జూన్ 3 విడుదల చేస్తున్నారు.
Balakrishna - Mahesh Babu : బాలకృష్ణను ఆ విధంగా ఫుల్లుగా వాడుకున్న మహేష్ బాబు..
ఈ సినిమాను ప్రముఖ ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. అమిత్ రవీంద్రనాథ్ శర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. మరోవైపు ఈయన రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ‘సర్కస్’ లో కేమియో రోల్లో కనిపించనున్నారు. ఈ సినిమా జూలై 15న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇంకోవైపు అజయ్ దేవ్‌గణ్.. ఇంద్ర కుమార్ దర్శకత్వంలో ‘థాంక్స్ గాడ్’ చిత్రంతో పాటు ‘భోళా’, ‘దృశ్యం 2’ సినిమాలకు ఓకే చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ajay Devgn, Amitabh bachchan, Bollywood news, Rakul Preet Singh, RRR, Runway 34 Movie