Home /News /movies /

RRR FACING SAME PROBLEM AGAIN AND SOME PHOTOS ARE LEAKED FROM SETS MHN

RRR - Raja Mouli - Ntr - Ram Charan: RRRను వేధిస్తున్న లీకేజీ సమస్య .. నెట్టింట వైరల్ అవుతోన్న మరికొన్ని లీకేజీ ఫొటోలు

RRR facing same problem again and some photos are leaked from sets

RRR facing same problem again and some photos are leaked from sets

RRR - Raja Mouli - Ntr - Ram Charan: RRR సినిమా క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ‌కు సంబంధించి కొన్ని ఫొటోలు లీక్ అయ్యాయి. ఇవి నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

    ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్‌(ర‌ణం రౌద్రం రుధిరం)’. గోండు వీరుడు కొమురం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్‌, మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో చేస్తున్న ఈ సినిమాను ఇప్పుడు లీకేజీ స‌మ‌స్య పెద్ద‌గా బాధిస్తుంది. రీసెంట్‌గా ట్రిపుల్ ఆర్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట లీక‌య్యాయి. అందులో ఓ గెట‌ప్‌లో రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ పోలీస్ అధికారి లుక్‌లో క‌నిపిస్తుండ‌టం విశేషం. మ‌రో దాంట్లో ఎన్టీఆర్‌, ఒలివియా మోరిస్ త‌దిత‌రులు ఈఫొటోస్‌లో క‌నిపిస్తున్నారు. మ‌రి జ‌క్క‌న్న అండ్ టీమ్ లీకేజీ రాయుళ్ల నుంచి ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటారో చూడాలి. ఇది 1920 బ్యాక్‌డ్రాప్‌లో సాగే రెండు నిజ‌మైన పాత్ర‌ల‌కు సంబంధించిన ఫిక్ష‌న‌ల్ పీరియాడిక‌ల్ మూవీ. ప్ర‌స్తుతం నిక్ పావెల్ ఆధ్వ‌ర్యంలో భారీ క్లైమాక్స్ ఫైట్‌ను జ‌క్క‌న్న అండ్ టీమ్ రూపొందిస్తుంది.

    అయితే ప్రస్తుతం క్లైమాక్స్‌ను పూర్తి చేసి సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న ఎలాగైనా విడుదల చేయాలని అనుకుంటున్న రాజమౌళి అండ్‌ టీమ్‌.. ఈ సమస్యను పెద్దది కానివ్వకుండా చర్యలు తీసుకుంటుందని అంటున్నాయి ట్రేడ్‌ వర్గాలు. బాహుబలి వంటి సెన్సేషనల్‌ పాన్‌ ఇండియా బ్లాక్‌బస్టర్‌ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన రామరాజు ఫర్‌ భీమ్‌, భీమ్‌ ఫర్‌ రామరాజు టీజర్స్‌ సహా టైటిల్‌ లోగో మోషన్‌ పోస్టర్‌లకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్సాన్స్‌ వస్తుంది.

    rrr, rajamouli, ram charan, alluri sita ramaraju, ram charan as alluri sita ramaraju, ram charan about rrr, rrr release date, tarak, komuram bheem, tarak as komuram bheem, RRR legal issue, rrr photos leaked, ఆర్ఆర్ఆర్, ట్రిపులార్, రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్, rrr pre release business, rrr pre release business record, tamil nadu rrr pre release business
    RRR facing same problem again and some photos are leaked from sets


    ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెర‌కెక్కుతోంది. ఇప్పుడు సినిమా క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ జ‌రుగుతుంది. ద‌స‌రా సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 13న విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేశారు. ఎన్టీఆర్‌, చరణ్‌లతో పాటు అజయ్ దేవగణ్‌, ఆలియా భట్‌, రే స్టీవెన్‌ సన్, అలిసన్‌ డూడి, సముద్రఖని తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు.
    Published by:Anil
    First published:

    Tags: Jr ntr, Ram Charan, RRR, Rrr movie, SS Rajamouli

    తదుపరి వార్తలు