ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తే.. ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. తెలుగు తెరపై చాలా ఏళ్ల తర్వాత ఇద్దరు టాప్ హీరోలు కలిసి నటిస్తోన్న అసలు సిసలు మల్టీస్టారర్ మూవీ ఇది. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీని శాసిస్తున్న నందమూరి, మెగా (కొణిదెల) ఫ్యామిలీకి చెందిన హీరోలు కలిసి నటిస్తుండంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాదు దాదాపు టాలీవుడ్ బడా హీరోలకు చెందిన నందమూరి మెగా ఫ్యామిలీల హీరోలతో రాజమౌళి అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. బాహుబలి వంటి ప్యాన్ ఇండియా మూవీ తర్వాత రాజమౌళి .. తన నెక్ట్స్ మూవీకి వీళ్లిద్దరినే ఎందుకు ఎంపిక చేసుకున్నాడనేదానికి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

RRR సినిమాలో చరణ్,అజయ్,ఎన్టీఆర్,జక్కన్న ఫోటో (RRR movie shooting pic)
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌తో గతంలో స్టూడెంట్ నెం. 1, సింహాద్రి, యమదొంగ వంటి మూడు సినిమాలు చేసాను. ఇక రామ్ చరణ్‌తో ‘మగధీర’ సినిమా తెరకెక్కించాను. వీళ్లిద్దరితో పని ఎంతో కంఫర్ట్‌గా ఉండటంతో పాటు ఆయా పాత్రలకు వీళ్లిద్దరైతే న్యాయం చేస్తారనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకు వీళ్లిద్దరిని ఎంపిక చేశానన్నారు. పైగా వీళ్లిద్దరు వ్యక్తిగతంగా మంచి స్నేహితులు. వాళ్లిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంతో కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతో వీరిని హీరోలుగా తీసుకున్నానన్నారు. ఈ చిత్రం పై తెలుగు ఇండస్ట్రీతో పాటు అన్ని భాషల్లో చాలా అంచనాలు ఉన్నాయి. పైగా బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో అంచనాలున్నాయి. ఈ సినిమాకు తెలుగులో రౌద్రం రణం రుధిరం అనే టైటిల్ ఖరారు చేసారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:April 25, 2020, 17:03 IST