RRR కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..

టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం RRR.ఈ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ తీసుకుంటున్న పారితోషకం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

news18-telugu
Updated: September 11, 2019, 7:40 AM IST
RRR కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..
rrr సినిమాలో ఎన్టీఆర్,రామ్ చరణ్
  • Share this:
టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం RRR. ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి  ఇద్దరు బడా మాస్ హీరోలతో.. అదీ చారిత్రక యోధులైన అల్లూరి సీతారామరాజు,కొమురం భీమ్‌లు ఒకవేళ కలిస్తే ఎలా ఉంటుందో అనే కాల్పనిక కథతో..  తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా జులై 30,2020లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం రాజమౌళి..ఎన్టీఆర్‌తో కొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు ఈ షెడ్యూల్‌లో ఎన్టీఆర్ ఒక పులితో పోరాట సన్నివేశాన్ని ప్లాన్ చేసినట్టు సమాచారం.ఇది ఈ సినిమాకే హైలెట్ అని చెబుతున్నారు. RRR కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ వేరే సినిమాలేవి ఒప్పుకోలేదు.

RRR movie Updates and Rajamouli designing a action sequence between Tiger and Jr NTR for Introduction pk రాజమౌళి దర్శకుడిగా ఉన్నాడంటే ఏదైనా జరుగుతుంది. అనుకుంటే కొండమీది కోతిని కూడా తీసుకొస్తాడు ఆయన. అలాంటి దర్శకుడు ఇప్పుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి సూపర్ స్టార్స్‌ను హీరోలుగా పెట్టి సినిమా చేస్తున్నాడు. rajamouli,rrr,rrr movie,rrr movie twitter,rrr movie instagram,jr ntr rrr,ram charan rrr,rrr movie jr ntr intro scene,rrr movie shooting,telugu cinema,రాజమౌళి,రాజమౌళి రామ్ చరణ్,రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్,పులితో ఎన్టీఆర్ ఇంట్రో ఫైట్
RRR సినిమా పోస్టర్ (Source: Twitter)


ఐతే.. ఒక్కో సినిమాకు రూ.15 కోట్లు తీసుకునే ఎన్టీఆర్, రామ్ చరణ్‌.. RRR కోసం మాత్రం రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల రెమ్యునరే‌షన్‌ తీసుకున్నట్టు సమాచారం. ముఖ్యంగా ‘బాహుబలి’ సిరీస్‌ తర్వాత జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అన్ని భాషల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్‌గణ్ సినిమాను మలుపు తిప్పే కీలక పాత్రలో నటిస్తున్నాడు. మొత్తానికి RRR కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకే కాదు.. మిగతా పాత్రల్లో నటిస్తోన్న నటీనటులకు కూడా భారీ స్థాయిలోనే ముట్టజెప్పబోతున్నట్టు సమాచారం.

First published: September 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...