హోమ్ /వార్తలు /సినిమా /

S. S. Rajamouli: హీరోలకు రాజమౌళి క్లారిటీ ఇచ్చారా.. అసలేమైంది?

S. S. Rajamouli: హీరోలకు రాజమౌళి క్లారిటీ ఇచ్చారా.. అసలేమైంది?

rajamouli

rajamouli

S. S. Rajamouli: ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు.

  S. S. Rajamouli: ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ నటిస్తున్నారు. పాన్ ఇండియా గా తెరకెక్కుతుంది ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇందులో స్వతంత్ర పోరాట యోధుల పాత్రలో చెర్రీ, తారక్ కనిపించనున్నారు. అంతే కాకుండా బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, ఐరిష్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

  ఇక ఇందులో అజయ్ దేవగన్, సముద్రఖని, రెస్టివెన్ సన్, అలిసన్ డోడి వంటి పలువురు నటులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది అక్టోబర్ లో విడుదల చేయాలని అనుకోగా.. ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో, చరణ్ సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే రాజమౌళి చెర్రీ, ఎన్టీఆర్ లకు ఓ క్లారిటీ ఇచ్చాడు.

  ఈ సినిమాను 2022 సంక్రాంతికే విడుదల చేయనున్నారని ముందే ప్రకటించారు. ఇక ఈ సినిమా షూటింగు పూర్తవడానికి కేవలం 20 రోజులు మాత్రమే ఉందని తెలుస్తుంది. కానీ విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం చాలా ఉందట. ఐదు నెలల సమయం ఉన్నా కూడా సంక్రాంతి విడుదల కావడం వీలవుతుందా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

  ఈ నేపథ్యంలో రాజమౌళి తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది. మొత్తానికి రాజమౌళి ఇద్దరు హీరోలకు క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ సినిమాల షూటింగ్ లలో పాల్గొంటారని తెలుస్తోంది. మొత్తానికి పలువురు దర్శకులతో చెర్రీ, తారక్ ఓకే అనగా సినిమాలు లైన్ లోనే రెడీగా ఉన్నాయి.

  Published by:Navya Reddy
  First published:

  Tags: NTR, Rajamouli, Ram Charan, Rrr movie, RRR release date

  ఉత్తమ కథలు