HOME »NEWS »MOVIE »rrr director rajamouli to make ramayan movie trending in twitter ta

త్వరలో వెండితెరపై రాజమౌళి రామాయణం.. ట్విట్టర్‌లో ట్రెండింగ్..

త్వరలో వెండితెరపై రాజమౌళి రామాయణం.. ట్విట్టర్‌లో ట్రెండింగ్..
రాజమౌళి రామాయణం (Twitter/Photo)

Rajamouli Make Ramayan |ఎన్ని సార్లు చదివినా.. ఎన్ని సార్లు విన్న తనవీ తీరని కావ్యం రామాయణం. తాజాగా రాజమౌళి రామాయణ్ సినిమాను నిర్మించాలని అభిమానులు ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు.

  • Share this:
ఎన్ని సార్లు చదివినా.. ఎన్ని సార్లు విన్న తనవీ తీరని కావ్యం రామాయణం. ఈ ఇతిహాసం గురించి ఇప్పుడు కొత్త‌గా తెలుసుకోవాల్సింది ఏం లేదు. కానీ ఎన్నిసార్లు చూసినా.. చ‌దివినా త‌నివి తీర‌ని మ‌హాకావ్యం రామాయ‌ణం. రాముడి గాథ‌.. ఆయ‌న జీవితం అంద‌రికీ ఆద‌ర్శ‌ప్రాయ‌మే. అంతేకాదు మన భారతీయులకు రాముడే ఆదర్శం. అంతేకాదు రాముడు మంచి బాలుడు అన్నట్టు చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలకు రాముడి పేరు పెట్టుకోవడం తరతరాలుగా కొనసాగుతూ వస్తోంది.  రామాయణం అంటే రాముడు నడిచిన దారి అని అర్ధం. దీనికి సీతాయణం అనే పేరు కూడా ఉంది. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగు ఇండ‌స్ట్రీలో ఎన్నిసార్లు రామాయ‌ణ గాథ చూపించినా కూడా ప్రేక్ష‌కులు ఆద‌రించారు. తాజాగా కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దూరదర్శన్‌లో రామాయణం సీరియల్‌ను పున: ప్రసారం చేస్తే దానికి విశేష ఆదరణ లభించింది. తాజాగా ఏప్రిల్ 16న ఈ సీరియల్‌ను దాదాపు 7.7 కోట్ల మంది వీక్షించారు. ఒక ప్రోగ్రామ్‌ను ఇంత మంది వీక్షించడం అనేది ప్రపంచ రికార్డు అనే చెప్పాలి. అంతేకాదు రామాయణం సీరియల్ పున: ప్రసారంతో ఈ డిజిటల్ యుగంలో వందలాది ప్రైవేటు ఛానెళ్ల పోటీని తట్టుకొని దూరదర్శన్‌ ఇండియాలో మళ్లీ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

రామాయణం సీరియల్ (Instagram/Photo)




అలాంటి అపూరూప కావ్యాన్ని సినిమా రూపంలో ఇప్పటి ప్రేక్షకులకు సినిమాగా రాజమౌళి తెరకెక్కిస్తే బాగుంటుందని నెటిజన్స్ అనుకుంటున్నారు. అంతేకాదు ట్విట్టర్‌లో రాజమౌళి రామాయణం తెరకెక్కించాలని #RajamouliMakeRamayan అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ చేస్తున్నారు. మరి నెటిజన్ల కోరికను స్పందిస్తూ.. రాజమౌళి రామాయణం సినిమాను తెరకెక్కిస్తాడా లేదా అనేది చూడాలి. ఇప్పటికే రాజమౌళి.. తాను రిటైర్మెంట్ అయ్యేలోపు మహాభారతం సినిమాను తెరకెక్కించడం తన కోరిక అంటూ ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికే ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్. తెలుగు,తమిళ్, హిందీ భాషల్లో దాదాపు రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో మూడు పార్టులతో ‘రామాయణం’ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా.

Sri Rama Navami Telugu Heroes who played lord sri rama charecters in Tollywood movies,sri rama navami,sri rama navami 2020,jai sri ram,sri rama navami,sri rama navami songs,sri rama navami wishes,sri rama navami celebrations,sri rama navami special songs,sri rama navami heros,sri rama navami videos,sri seeta rama kalyanam in bhadrachalam live,sri rama navami live,tollywood,sri rama navami festival,sri rama navami special movie songs,sri rama navami at bhadrachalam,sri rama navami 2019,sri rama navami bhadrachalam,tollywood heroes played lord sri rama charecters,ntr balakrishna,jr ntr,suman sri rama,srikanth sri rama,srikanth,kantha rao,haranath seetharamakalyanam,sri ramarajyam,ramayanama,sampoorna ramayanam,tollywood,telugu cinema,jabardasth,extra jabardasth,rashmi gautham,nagababu,వెండితెర రాముడు,టాలీవుడ్ శ్రీరాముడు,సినిమా రాముడు,సీతారామకళ్యాణం ఎన్టీఆర్ హరనాథ్,శ్రీరామ రాజ్యం బాలకృష్ణ,రామాయణం జూనియర్ ఎన్టీఆర్ తారక్,శ్రీరామదాసు సుమన్,దేవుళ్లు శ్రీకాంత్,జబర్థస్త్,టాలీవుడ్ న్యూస్,తెలుగు సినిమా,
వెండితెర పై రాముని పాత్రలో నటించిన హీరోలు (Facebook/Photos)


అత్యంత భారీ సాంకేతికతో తెరకెక్కనున్న ఈ సినిమాను మ‌ధు మంతెన‌, న‌మిత్ మ‌ల్హోత్రా అనే మ‌రో ఇద్ద‌రు నిర్మాత‌ల‌తో క‌లిసి రామాయ‌ణం సినిమాను 3డిలో నిర్మించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు అల్లు అరవింద్. ఈ సినిమా కోసం ప్ర‌త్యేకంగా హాలీవుడ్ నుంచి 3డి కెమెరాలు తెప్పించారు.  ఈ సినిమాను దంగల్ ఫేమ్ నితిష్ తివారీ, ‘మామ్’ ఫేమ్ రవి ఉద్యావర్‌తో డైరెక్ట్ చేయనున్నారు.
Published by:Kiran Kumar Thanjavur
First published:May 03, 2020, 17:02 IST