news18-telugu
Updated: July 29, 2020, 9:21 PM IST
రాజమౌళి Photo : Twitter
Rajamouli Corona Possitive: ప్రముఖ దర్శకుడు రాజమౌళికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా అన్ని సినీ ఇండస్ట్రీస్‌లో కరోనా కలకలం రేపుతోంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ ఆయన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక బిగ్‌బీ తప్పించి మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా దర్శక బాహుబలి రాజమౌళికి తాజాగా జరిపిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ నిర్ధారణ అయింది. రెండు మూడు రోజులుగా తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ఒంట్లో నలతగా ఉండటంతో టెస్టులు చేయించుకున్నాం. ఆ రిపోర్టులో తనతో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో డాక్టర్ల సలహా మేరకు ఇంట్లోనే సెల్ఫ్ క్వారంటైన్లో ఉండనున్నట్టు ప్రకటించాడు. గత కొన్ని రోజులుగా తనకు కలిసిన వాళ్లు కరోనా టెస్టులు చేయంచుకోమని చెప్పాడు.
ప్రస్తుతం రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్గణ్లతో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో ఆసక్తి నెలకొంది. మరోవైపు కరోనాతో కోలీవుడ్‌లో విశాల్ కుటుంబ సభ్యులు, శాండిల్‌వుడ్‌లో ధృవ సర్జ కుటుంబ సభ్యులు కరోనా బారిన పడ్డారు.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
July 29, 2020, 9:07 PM IST