ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆలియా ఎంపికపై రాజమౌళి క్లారిటీ..

రాజమౌళి,అలియా భట్

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో చేస్తోన్న భారీ మల్టీస్టారర్ పై  ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ఆలియా పాత్రపై రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

  • Share this:
    రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ RRR గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎన్టీఆర్,రామ్ చరణ్ వంటి మాస్ హీరోలతో చేస్తోన్న భారీ మల్టీస్టారర్ పై  ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్ నటిస్తోంది. ప్రస్తుతం కరోనా కారణంగా ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే.. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వచ్చే యేడాది ఏప్రిల్ 28న విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో అలియా పాత్రపై  క్లారిటీ ఇచ్చారు జ‌క్క‌న్న‌.ఈ సినిమాలో సీత పాత్ర కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య నిలబడగిలిగే నటి నాకు కావాలి. ఎందుకంటే వీళ్లిద్దరు ఎంతో టాలెంట్ ఉన్న నటులు. సీత పాత్ర అమాయకంగా ఉండాలి. అదే విధంగా గడుసుదనం కూడా ఉండాలి. అందుకే ఈ పాత్ర కోసం ఆలియాను ఎంపిక చేసినట్టు చెప్పుకొచ్చారు. అలా అని ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు. ఈ చిత్రంలో ఆలియా భట్ రామరాజు మరదలు సీతగా కనిపించ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకోవడం ఖాయం అని చెప్పుకొచ్చారు రాజమౌళి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: