ఎన్టీఆర్‌కు రాజమౌళి బర్త్‌డే విషెస్ .. స్టూడెంట్ నెం 1 నాటి ఫోటోను షేర్ చేసిన జక్కన్న..

రాజమౌళి,ఎన్టీఆర్ (Instagram/Photo)

ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసాడు.అంతేకాదు వీళ్లిద్దరు తొలిసారి కలిసి పనిచేసిన స్టూడెంట్ నెం. 1 నాటి ఫోటోను షేర్  చేసాడు.

 • Share this:
  ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దర్శక ధీరుడు రాజమౌళి ఎన్టీఆర్‌కు బర్త్ డే విషెస్ తెలియజేసాడు.అంతేకాదు వీళ్లిద్దరు తొలిసారి కలిసి పనిచేసిన స్టూడెంట్ నెం. 1 నాటి ఫోటోను షేర్  చేసాడు. ఇక స్టూడెంట్ నెం. 1 విషయానికొస్తే.. ఈ సినిమాతో హీరోగా ఎన్టీఆర్ తొలి విజయం అందుకున్నాడు. అంతేకాదు.. దర్శకుడిగా రాజమౌళి సినీ ప్రస్థానం కూడా ఇదే సినిమాతో మొదలైంది. మొత్తంగా చెప్పాలంటే ఎన్టీఆర్, రాజమౌళి ఒకేసారి తమ కెరీర్‌ను స్టార్ట్ చేసారు. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన సింహాద్రి తెలుగు సినీ ఇండస్ట్రీలో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ స్టార్ హీరోల సరసన నిలిచాడు.  అంతేకాదు చిన్ వయసులోనే అదిపెద్ద మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోగా నిలిచి రికార్డులకు ఎక్కాడు. ఆ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన యమదొంగ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ఇపుడు ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఎన్టీఆర్ కూడా తన కెరీర్‌లో ఒక దర్శకుడితో నాల్గో సినిమా చేస్తున్నది రాజమౌళితోనే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. మరోవైపు ఈ సినిమాలో ఎన్టీఆర్‌తో పాటు రామ్ చరణ్ మరో కథానాయకుడిగా అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాను రాజమౌళి ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నాడు.
  View this post on Instagram

  I am glad you were a part of my journey from the start! Happy birthday dear Tarak. I couldn't have found a better Bheem :)


  A post shared by SS Rajamouli (@ssrajamouli) on
  Published by:Kiran Kumar Thanjavur
  First published: