RRR : ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా మిగిలిన దేశం మొత్తం ఆర్ఆర్ఆర్ ఫీవర్‌తో ఊగిపోతోంది. రిలీజ్‌కు ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండటం పైగా ప్యాన్ ఇండియా మూవీ కావడంతో రాజమౌళి.. ఎన్టీఆర్ ,రామ్ చరణ్‌లను వెంటేసుకొని దేశం మొత్తాన్ని చుట్టేస్తున్నారు. ఈ ప్రమోషన్లో భాగంగా ఆర్ఆర్ఆర్ టీమ్ ఆమీర్ ఖాన్‌తో దిగిన సెల్ఫీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
RRR : ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా మిగిలిన దేశం మొత్తం ఆర్ఆర్ఆర్ ఫీవర్‌తో ఊగిపోతోంది. రిలీజ్‌కు ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉండటం పైగా ప్యాన్ ఇండియా మూవీ కావడంతో రాజమౌళి.. ఎన్టీఆర్,రామ్ చరణ్‌లను వెంటేసుకొని దేశం మొత్తాన్ని చుట్టేస్తున్నారు. మొన్న దుబాయ్‌లో నిన్న కర్ణాటక చిక్‌బళ్లాపూర్‌లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నిన్న గుజరాత్‌లోని వడోదర (బరోడా)తో పాటు, ఢిల్లీలో ఈ సినిమా ప్రచారం నిర్వహించారు. ఢిల్లీలోని ఇంపీరియల్ హోటల్ లాన్స్‌లో ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఓ ప్రమోషన్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రామానికి హిందీ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ చీఫ్ గెస్ట్‌గా వచ్చి చిత్ర యూనిట్‌ను అభినందించారు. ఈ వేడుక లో అమీర్ ఖాన్ నాటు నాటు హిందీ బీట్ కి స్టెప్పులు వేశారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అలియా భట్లు సైతం స్టెప్పులు వేశారు.
మరోవైపు ఆర్ఆర్ఆర్ చిత్ర దర్శకుడు రాజమౌళి.. బాలీవుడ్ అగ్ర హీరోతో కలిసి తన టీమ్ మెంబర్స్‌లో కలిసి సెల్ఫీ దిగారు. దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ విషయానికొస్తే.. డాల్బీ ఫార్మాట్లో విడుదల కాబోతున్న మొదటి భారతీయ చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
మరోవైపు మేకర్స్ ఆర్ఆర్ఆర్ మూవీని 3D టెక్నాలజీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా ప్రివ్యూను రాజమౌళి, ఎన్టీఆర్ ,రామ్ చరణ్.. సహా ఆర్ఆర్ఆర్ టీమ్ మెంబర్స్ .. ఫిబ్రవరి 24 రాత్రి హైదరాబాద్ సుదర్శన్ 35 MM లో మిడ్ నైట్ 12.30న ఈ సినిమా స్పెషల్ షోను వీక్షించనున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ టీమ్ 450పైగా టికెట్స్‌ను కూడా బుక్ చేసారట.
ఈ రోజు ఆర్ఆర్ఆర్ టీమ్ ( మార్చి 21)న పంజాబ్‌లోని అమృత్‌సర్‌తో పాటు రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. మార్చి 22న పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత్తాతో పాటు వారణాసీలో ప్రీ రిలీజ్ రిలీజ్ వేడుకల్లో భాగంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీని ఐమ్యాక్స్, డాల్బీ డిజిటల్‌లలో విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమాను యూకేలోని ఓడియన్ బీఎఫ్ఐ ఐమ్యాక్స్ థియోటర్స్ ప్రీమియర్ షోగా ప్రదర్శించనున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించనున్నట్టు తెలుస్తుంది. ఇక యూకేలోని వెయ్యి స్క్రీన్స్‌లో (RRR) ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల చేస్తున్నారట.
ఇక ఆర్ ఆర్ ఆర్ (RRR) విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించనున్నారు. మరోవైపు ఈ (RRR) చిత్రం ఓటిటి రిలీజ్ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయికాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ (RRR) విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు.ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.