NTR Evaru Meelo Koteeswarulu: ఇక్కడ నేనే బాస్ అంటూ రాజమౌళి, కొరటాలను వణికించేసిన ఎన్టీఆర్!

NTR Evaru Meelo Koteeswarulu

NTR Evaru Meelo Koteeswarulu: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఆయన నటన గురించి అందరికీ తెలిసిందే. ఎంతో మంది స్టార్ దర్శకుల సినిమాలలో నటించి టాలీవుడ్ స్టార్ హీరోగా నిలిచాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు.

  • Share this:
    NTR Evaru Meelo Koteeswarulu: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ఆయన నటన గురించి అందరికీ తెలిసిందే. ఎంతో మంది స్టార్ దర్శకుల సినిమాలలో నటించి టాలీవుడ్ స్టార్ హీరోగా నిలిచాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. అంతేకాకుండా బుల్లితెరపై కూడా రియాలిటీ షో లో హోస్టింగ్ చేస్తూ బాగా బిజీగా ఉన్నాడు. ఇలా ఉంటే తాజాగా రాజమౌళి, కొరటాలకే కౌంటర్ ఇచ్చాడు ఎన్టీఆర్.

    ప్రస్తుతం ఎన్టీఆర్ ఈ ఇద్దరి స్టార్ దర్శకుల సినిమాలలో అవకాశాలు అందుకున్న సంగతి తెలిసిందే. అలాంటిది స్టార్ దర్శకులకే కౌంటర్ ఇచ్చాడు ఎన్టీఆర్. అదేంటి అనుకుంటున్నారా.. ప్రస్తుతం ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు అనే రియాలిటీ షో లో బిజీగా ఉండగా ఇప్పటికే పలు ఎపిసోడ్ లు కూడా పూర్తయ్యాయి. ఇక మధ్య మధ్యలో సెలబ్రిటీలు కూడా గెస్ట్ లుగా వచ్చి బాగా సందడి చేస్తున్నారు. ఇక తాజాగా కొరటాలను, రాజమౌళి లను కూడా రప్పించాడు ఎన్టీఆర్.

    ఇది కూడా చదవండి:రికార్డు సృష్టించిన ఎవరు మీలో కోటిశ్వరులు.. ఆ విషయంలో నాగార్జున, చిరంజీవిని కూడా వెనక్కి నెట్టిన ఎన్టీఆర్!

    ఒక స్టార్ హీరోతో పాటు ఇద్దరు స్టార్ దర్శకులు కలిసి ముచ్చట్లు పెట్టడం తక్కువ సందర్భాల్లో చూస్తుంటాం. ఇక ఆ సందర్భం తాజాగా ఎవరు మీలో కోటీశ్వరులులో చూడవచ్చు. తాజాగా ఈ షో ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలయింది. అందులో కొరటాల శివ, ఎస్ ఎస్ రాజమౌళి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ ముందు కూర్చొని.. కొరటాల రోల్ కెమెరా యాక్షన్ అనగా.. పక్కనే ఉన్న రాజమౌళి సౌండ్ క్లాటింగ్ యాక్షన్ అంటూ సెట్ లో ఉన్నట్లు కాస్త ఆట పట్టించారు.

    ఇది కూడా చదవండి:అవకాశం వచ్చిందని రాజమౌళిపైనే సెటైర్లు వేశారుగా.. కంటపడితే రామ్ చరణ్, ఎన్టీఆర్ పరిస్థితేంటో?

    ఎన్టీఆర్ వాళ్ళని చూస్తూ ఫేస్ ను కాస్త ఫన్నీగా పెట్టగా వాళ్లకి ఒక కౌంటర్ ఇచ్చాడు. ఎన్టీఆర్ మాట్లాడుతున్న కూడా వాళ్ళిద్దరూ ఏదో స[-మాధానం కోసం మాట్లాడుకున్నట్లు కనిపించారు. ఎన్టీఆర్ వెంటనే.. ఎంతసేపు మీరు మీరే మాట్లాడుకోవడమేనా.. ఇక్కడ కూడా మాకు అవకాశం ఇవ్వరా అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆ సందర్భం చూస్తే బాగా ఫన్నీగా అనిపించింది. ఎన్టీఆర్ కంప్యూటర్ తో ఆప్షన్ ఇవ్వకుండా ప్రశ్నలు క్యాన్సల్ చేయవచ్చా అని అడగగా వెంటనే కొరటాల, రాజమౌళి ఎన్టీఆర్ ను గట్టిగా అడిగేసారు. ఎన్టీఆర్ మాత్రం ఇది నా లోకేషన్ నా డైరెక్షన్.. ఇక్కడ నేనే బాస్ అంటూ ఇద్దరు దర్శకులకు ఫన్నీగా కౌంటర్ ఇవ్వడంతో మరోసారి ఇలా చేయము అంటూ ఆ దర్శకులు కూడా కామెంట్ వేశారు. ఇక ఈ ఎపిసోడ్ సోమవారం రోజున ప్రసారం కానుంది.
    Published by:Navya Reddy
    First published: