SS Rajamouli: కరోనాను జయించిన రాజమౌళి.. కోవిడ్ నుంచి కోలుకున్న జక్కన్న ఫ్యామిలీ..

SS Rajamouli Corona Negative: ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనతో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్  నిర్ధారణ అయిందని గత నెల 30న ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కరోనా నుంచి కోలుకున్నట్టు ట్వీట్ చేసాడు.

news18-telugu
Updated: August 12, 2020, 6:39 PM IST
SS Rajamouli: కరోనాను జయించిన రాజమౌళి.. కోవిడ్ నుంచి కోలుకున్న జక్కన్న ఫ్యామిలీ..
రాజమౌళికి కరోనా నెగిటివ్ (File/Photo)
  • Share this:
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) తనతో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్  నిర్ధారణ అయిందని గత నెల 30న ప్రకటించిన సంగతి తెలిసిందే . కోవిడ్ 19 సోకడంతో డాక్టర్ల సలహా మేరకు ఆయన ఇంట్లోనే హోం క్వారంటైన్‌లో ఉంటూ కరోనాకు చికిత్స తీసుకున్నారు. తాజాగా రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులతకు నిర్ధేశించిన గుడవు పూర్తి కావడంతో మరోసారి కరోనా టెస్టు జరిపిస్తే..తాజాగా అందరికీ కోవిడ్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసాడు. రీసెంట్‌గా అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన ఫ్యామిలీ కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. అటు నటి సుమలత, కమెడియన్ కమ్ నిర్మాత బండ్ల గణేష్‌ కూడా కరోనా నుంచి కోలుకున్నారు.


మరోవైపు రాజమౌళి ప్లాస్మా దానం గురించి చెబుతూ.. డాక్టర్లు తమను మూడు వారాలు వెయిట్ చేయమని చెప్పినట్టు చెప్పుకొచ్చారు. ఈ లోగా తన శరీరంలో యాండీ బాడీస్ వృద్ధి చెందితే ప్లాస్మా దానం చేయడానికి ముందుకొస్తామని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం రాజమౌళి.. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవ్‌గణ్‌లతో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే కదా.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 12, 2020, 6:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading