RRR COLLECTIONS RAM CHARAN RAJAMOULI NTR RRR CROSSES13MILLION DOLLAR MARK IN THE UNITED STATES OF AMERICA HERE ARE THE DETAILS SF
RRR Collections : అమెరికాలో 13 మిలియన్ డాలర్స్ వసూలు.. 100 కోట్ల చేరువలో ఆర్ ఆర్ ఆర్..
RRR Collections Photo : Twitter
RRR Collections : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది.
ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది. దీనికి సంబంధించి టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక మరోవైపు ఆర్ ఆర్ ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్లో అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 13 మిలియన్ డాలర్స్‌ను వసూలు చేసి మరో రికార్డ్ క్రియేట్ చేసింది. అంటే దాదాపుగా 98 కోట్ల గ్రాస్. ఇక హిందీలో కూడా మంచి వసూళ్లను రాబడుతోంది. అక్కడ 200 కోట్ల నెట్‌ను వసూలు చేసింది. ఆర్ ఆర్ ఆర్ (Roudram Ranam Rudhiram) బాక్సాఫీస్ దగ్గర మొదటి వారాన్ని ఎక్స్ ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ తో పూర్తీ చేసుకుని ఇక రెండో వారంలో కూడా కేక పెట్టిస్తోంది. ఈ సినిమా తొమ్మిదో రోజు టాలీవుడ్ చరిత్రలోనే ఊహకందని విధంగా.. ఏకంగా 19.62 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని ప్రభంజనం సృష్టించింది. అంతేకాదు తొమ్మిదో రోజు వరల్డ్ వైడ్‌గా ఏకంగా 37.12 కోట్ల షేర్ సొంతం చేసుకుని దుమ్ము లేపింది. ఇక ఈ సినిమా 13వ రోజు రెండు రాష్ట్రాల్లో 2.54 కోట్ల షేర్ని సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్‌గా 7.45 కోట్ల వరకు వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ 13 రోజులు కలెక్షన్స్
Nizam: 102.60Cr
Ceeded: 46.92Cr
UA: 31.93Cr
East: 14.54Cr
West: 12.12Cr
Guntur: 16.88Cr
Krishna: 13.50Cr
Nellore: 8.41Cr
AP-TG Total:- 246.90CR(371.00CR Gross)
KA: 39.30Cr
Tamilnadu: 35.05Cr
Kerala: 9.85Cr
Hindi: 99.50Cr
ROI: 7.85Cr
OS – 90.05Cr
Total WW: 528.50CR(Gross- 951.50CR)
ఆర్ ఆర్ ఆర్ సినిమాను బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ చేయగా... 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించి ఈ సినిమా 75.50 కోట్ల ప్రాఫిట్‌ను సొంతం చేసుకుంది. ఇక ప్రమోషన్లో భాగంగా ఇటీవల హుషారైనా పాట ఎత్తర జెండా వీడియోను యూట్యూబ్‌లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట ను విశాల్ మిశ్రా, పృధ్వీ చంద్ర, ఎంఎం కీరవాణి, సాహితి చాగంటి, హారిక నారాయణ్‌లు పాడారు. హుషారుగా సాగుతున్న ఈ పాట ఆర్ ఆర్ ఆర్ అభిమానులకి మరింత ఎనర్జీ ఇస్తోంది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు.
ఇక మరోవైపు ఈ సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్లో కూడా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్లో రిలీజ్ కాలేదు. ఆర్ ఆర్ ఆర్ నటులు (RRR) విషయానికి వస్తే.. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లకు జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. మరోవైపు ఈ (RRR) చిత్రం ఓటిటి రిలీజ్ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయికాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ (RRR) విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. అయితే హిందీ రైట్స్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. మిగితా సౌత్ భాషల రైట్స్‌ను జీ5 సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.