RRR COLLECTIONS RAM CHARAN RAJAMOULI NTR RRR COLLECTS 250 CR IN HINDI MARKET HERE ARE THE DETAILS SR
RRR Collections : హిందీలో 250 కోట్లు వసూలు చేసిన ఆర్ ఆర్ ఆర్.. ఇంకా సూపర్ స్ట్రాంగ్..
RRR Collections : Photo : Twitter
RRR Collections : ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది.
ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) (Roudram Ranam Rudhiram) పేరుతో (NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు (Ram Charan) ప్రధాన పాత్రల్లో రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామా వచ్చిన సంగతి తెలిసిందే. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. అంతేకాదు పాత రికార్డ్స్‌ను బ్రేస్తూ కేక పెట్టిస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లను వసూలు చేసింది. ఇక ఆర్ ఆర్ ఆర్ 24 వ రోజు వరల్డ్ వైడ్‌గా 6 కోట్లకి పైగా గ్రాస్‌ను సొంతం చేసుకుంది. మొత్తంగా 585 కోట్ల రేంజ్లో షేర్ వసూలు అవ్వగా.. వరల్డ్ వైడ్ గ్రాస్ 1076 కోట్ల మార్క్ ని అందుకుందని అంటున్నారు. ఇక మరోవైపు హిందీలో ఈ చిత్రం 250 కోట్ల నెట్ వసూలు చేసిందని అంటున్నారు. దీనికి సంబంధించి ఆర్ ఆర్ ఆర్ (RRR) టీమ్ ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆర్ ఆర్ ఆర్ అమెరికాలో కూడా ఓ రేంజ్లో అదరగొడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా ఇప్పటికే 14 మిలియన్ డాలర్స్‌పైగా వసూలు చేసి 100 కోట్లకు పైగా గ్రాస్‌ను అందుకుంది. అయితే అమెరికాలో ఈ ఫీట్ సాథించిన మరో సినిమా బాహుబలి 2 (Bahubali).. ఇండియా నుంచి ఈ రెండు సినిమాలు అమెరికాలో 100 కోట్ల గ్రాస్‌ను అందుకున్నాయి. ఇక్కడ మరో విషయం ఏమంటే ఈ రెండు సినిమాలు కూడా రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చినవే.
ఆర్ ఆర్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 451 కోట్ల బిజినెస్ చేయగా... 453 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగింది. అయితే బ్రేక్ ఈవెన్ సాధించి ఈ సినిమా ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తోంది. ఈ సినిమాలో (NTR, Ram Charan) ఎన్టీఆర్, రామ్ చరణ్‌లుతెలుగు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేశారు. వీరికి జంటగా ఇంగ్లీష్ నటీ ఒలివియా మోరీస్, హిందీ నటి ఆలియా భట్ (Olivia Morris, Alia Bhatt) నటించారు. అజయ్ దేవ్‌గణ్ కథను మలుపు తిప్పే కీలక పాత్రలో కనిపించారు. మరోవైపు ఈ (RRR) చిత్రం ఓటిటి రిలీజ్ ఎప్పుడు ఉండనుందో అనే విషయంలో అనేక రూమర్స్ వినిపిస్తున్నాయికాగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఆర్ ఆర్ ఆర్ (RRR) విడుదలైన 60 రోజులకు ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని అంటున్నారు.
#RRR hits ₹ 250 cr mark on Day 23... Biz on [fourth] Sun [today] should be healthy as well... [Week 4] Fri 3 cr, Sat 3.30 cr. Total: ₹ 250.09 cr. #India biz. pic.twitter.com/TwUEH0EEOM
ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని టాక్. అయితే హిందీ రైట్స్ మాత్రమే నెట్ ఫ్లిక్స్ (RRR on Netfilx) సొంతం చేసుకోగా.. మిగితా సౌత్ భాషల రైట్స్‌ను జీ5 (Zee5) సొంతం చేసుకుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం అందించారు.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.