Chiranjeevi - Ram Charan : తండ్రి మెగాస్టార్ చిరంజీవి లక్కీ డేట్ రోజునే.. తనయుడు రామ్ చరణ్.. తన మొదటి చిత్రం ‘చిరుత’ సినిమా విడుదలైంది. ఈ మూవీ చిరంజీవి లక్కీ డేట్ రోజునే విడుదలైంది. వివరాల్లోకి వెళితే..
Chiranjeevi - Ram Charan : తండ్రి మెగాస్టార్ చిరంజీవి లక్కీ డేట్ రోజునే.. తనయుడు రామ్ చరణ్.. తన మొదటి చిత్రం ‘చిరుత’ (Chirutha) సినిమా విడుదలైంది. ఈ మూవీ చిరంజీవి లక్కీ డేట్ రోజునే విడుదలైంది. వివరాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ‘చిరుత’గా అడుగుపెట్టి.. ఆ తర్వాత నెక్ట్స్ మూవీ ‘మగధీర’తో టాలీవుడ్ రికార్డులన్నింటినీ తిరగరాసి మెగా ధీరుడు అనిపించుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా చిరుతగా అడుగుపెట్టిన రామ్ చరణ్.. ఈ రోజుతో 14 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే.. హీరోగా రామ్ చరణ్ మొదటి చిత్రం విడుదలైన ఈ రోజు.. చిరంజీవికి కూడా వెరీ వెరీ స్పెషల్. ఇదే డేట్ రోజున సరిగ్గా 31 యేళ్ల క్రితం చిరంజీవి.. హిందీలో తొలిసారి నటించిన ‘ప్రతిబంధ్’ సినిమా విడుదలైంది ఈ రోజే.
అంతేకాదు తొలిసారి బాలీవుడ్లో హీరోగా అడుగుపెట్టి విజయాన్ని కూడా అందుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, రవిరాజ పినిశెట్టి కాంబినేషన్లో వచ్చిన నాల్గో చిత్రం ‘ప్రతిబంధ్’. ఈ చిత్రం తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రాజశేఖర్ హీరోగా తెరకెక్కిన ‘అంకుశం’ సినిమాకు హిందీ రీమేక్. దర్శకుడిగా రవిరాజ పినిశెట్టికి హీరోగా చిరంజీవికి ఇదే హిందీలో ఫస్ట్ మూవీ.
తొలి హిందీ చిత్రంతోనే బాలీవుడ్లో సక్సెస్ అందుకున్నారు చిరంజీవి. నిర్మాతగా అల్లు అరవింద్‌కు తొలి బాలీవుడ్ మూవీ కావడం విశేషం. ఇదే సినిమాతో రామిరెడ్డి కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇలా చిరంజీవి, అల్లు అరవింద్, రవిరాజా పినిశెట్టి, రామిరెడ్డితో పాటు పలువురు నటీనటులకు టెక్సీషియన్స్కు ఇదే ఫస్ట్ మూవీ కావడం విశేషం.
చిరంజీవి ఫస్ట్ హిందీ మూవీ రిలీజ్ రోజునే రామ్ చరణ్ తొలి మూవీ చిరుత’ విడుదల (Twitter/Photo)
ఇలా చిరంజీవికి హిందీలో మొదటి చిత్రం విడుదలైన రోజున రామ్ చరణ్.. తన మొదటి సినిమా ‘చిరుత’ను విడుదల చేయడం విశేషం. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్లో నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మించారు. మణిశర్మ సంగీతం అందించారు. నేహా శర్మ కథానాయికగా నటించింది. ఈ చిత్రం మ్యూజికల్‌గా సూపర్ హిట్‌గా నిలిచింది.తొలి సినిమా ‘చిరుత’తో తండ్రి తగ్గ తనయుడిగా.. డాన్సుల్లో, ఫైట్స్‌లో చిరంజీవి నట వారసుడు అనిపించుకున్నారు.
ఈ సినిమా పూరీ జగన్నాథ్ పుట్టినరోజున విడుదల కావడం విశేషం. తండ్రి హీరోగా తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ కొణిదెల ప్రొడక్షన్స్ స్థాపించి ‘ఖైదీ నెంబర్ 150’ మూవీతో నిర్మాతగా మారిన రామ్ చరణ్ . ఈ పినిమాలో గెస్ట్ అప్పీరియన్స్ కూడా ఇచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది.తండ్రి చిరంజీవితో కలిసి ‘మగధీర’, బ్రూస్లీ’, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాల్లో కాసేపు స్క్రీన్ షేర్ చేసుకున్న రామ్ చరణ్ . ఇపుడు ‘ఆచార్య’లో పూర్తి స్థాయిలో కలిసి నటించబోతున్నారు. మొత్తంగా తండ్రి చిరంజీవికి హిందీలో కలిసొచ్చిన రోజునే రామ్ చరణ్.. తన మొదటి సినిమాను విడుదల చేయడం విశేషం.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.