హోమ్ /వార్తలు /సినిమా /

RRR: ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇవాళ మరో సర్ ప్రైజ్

RRR: ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఇవాళ మరో సర్ ప్రైజ్

RRR ఓటీటీ రిలీజ్ డేట్

RRR ఓటీటీ రిలీజ్ డేట్

ఆర్ఆర్ఆర్ రాజమౌళి (Rajamouli) డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు అన్ని రికార్డులు బద్దలు కొట్టింది. ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను పాన్ ఇండియా స్టార్లుగా మార్చింది.

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమా విడుదలై నెలరోజులు గడుస్తున్నా ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల సునామీ మాత్రం తగ్గడం లేదు. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 పోటీని తట్టుకుంటూ రికార్డ్స్ స్థాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది ఆర్ఆర్ఆర్. అల్లురి సీతారామరాజు.. కోమురం భీమ్ పాత్రలలో తారక్(Jr ntr), చరణ్ (Ram Charan)నటనను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.

అయితే ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా నుండి పలు వీడియో సాంగ్స్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా, తాజాగా మరో సర్‌ప్రైజ్‌  ఇచ్చేందుకు ఆర్ఆర్ఆర్ టీమ్ రెడీ అవుతోంది. ఈ సినిమా చివర్లో, టైటిల్ కార్డ్స్ పడే సమయంంలో ‘ఎత్తర జెండా’ అనే పాటను పెట్టి ఆడియెన్స్‌ను థ్రిల్ చేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫుల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఇవాళ సాయంత్రమే  ఎత్తర జెండా ఫుల్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు.

ఎత్తర జెండా పాటను ఏప్రిల్ 26న సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు వారు అనౌన్స్ చేశారు. ఈ సాంగ్‌లో రామ్ చరణ్, ఎన్టీఆర్, ఆలియా భట్‌లు కలిసి డాన్స్ చేశారు. దీంతో ఈ పాట మెగా ,నందమూరి అభిమానులను ఉర్రూతలూగించింది. ఇక అందరికీ సర్‌ప్రైజ్ ఎలిమెంట్‌గా ఈ పాటలో దర్శకుడు రాజమౌళి కూడా కనిపించడం విశేషం. ఇప్పటికే రిలీజ్ అయిన ఇతర వీడియో సాంగ్స్ ఆర్ఆర్ఆర్ సత్తాను యూట్యూబ్‌లోనూ చాటుతుండగా.తాజాగా ఇవాళ విడుదల కానున్న ఎత్తరజెండా కూడా అదిరిపోయే రెస్పాన్స్‌ను వస్తోందని అభిమానులు అంటున్నారు. పాట కోసంరామ్ చరణ్,ఎన్టీఆర్ ఫ్యాన్స్  ఆశగా ఎదురు చూస్తున్నారు.

మరోవైపు ఈ సినిమా కలెక్షన్ల సునామీగా మారింది. రీసెంట్‌గా  ఈ సినిమా రూ. 1110 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌లో చేరింది.  ఈ మధ్య కాలంలో ఒక సినిమా హిట్టైనా.. ఏదో ఒక ఏరియాలో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోలేకపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ ఆర్ఆర్ఆర్ మూవీ మాత్రం అన్ని ఏరియాల్లో లాభాల్లో రావడం విశేషం. ఈ సినిమాలో బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవ్‌గణ్ మరో ముఖ్యపాత్రలో నటించారు. బాలీవుడ్  హీరోయిన్ ఆలియా భట్, ఒలివియా మోరీస్ కథానాయికలుగా మెరిసారు.

First published:

Tags: Jr ntr, Raja mouli, Ram Charan, RRR

ఉత్తమ కథలు