RRR-Alia Bhatt : ఆర్ఆర్ఆర్‌ షూట్‌లో ఆలియా భట్ పాల్గొనే డేట్ ఫిక్స్..

RRR-Alia Bhatt | రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలతో తెరకెక్కిస్తోన్న ‘రౌద్రం రణం రుధిరం’ అదేనండి ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందునుంచి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. ఐతే.. ఈ సినిమాకు బాలీవుడ్‌లో క్రేజ్ తీసుకొచ్చేందకు ఆలియా భట్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసారు.తాజాగా ఈ సినిమాలో ఆలియా భట్ షూటింగ్‌లో పాల్గొనే డేట్ ఫిక్స్ అయింది.

news18-telugu
Updated: October 28, 2020, 10:50 PM IST
RRR-Alia Bhatt : ఆర్ఆర్ఆర్‌ షూట్‌లో ఆలియా భట్ పాల్గొనే డేట్ ఫిక్స్..
ఆర్ఆర్ఆర్‌లో ఆలియా భట్ పాల్గొనబోయే డేట్ ఫిక్స్ (Twitter/Photo)
  • Share this:
RRR-Alia Bhatt | ప్రభాస్‌తో బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలతో తెరకెక్కిస్తోన్న ‘రౌద్రం రణం రుధిరం’ అదేనండి ఆర్ఆర్ఆర్ సినిమాకు ముందునుంచి ఏదో ఒక అవాంతరం వస్తూనే ఉంది. ఐతే.. ఈ సినిమాకు బాలీవుడ్‌లో క్రేజ్ తీసుకొచ్చేందకు ఆలియా భట్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసారు. మరోవైపు ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ టీజర్‌ను రిలీజ్ చేస్తే..రెస్పాన్స్ సంగతి పక్కనపెడితే.. అంతకు మించి వివాదాలు చుట్టుముట్టాయి. ఇప్పటికే కొంత మంది గిరిజన నేతలు రాజమౌళికి వార్నింగులు గట్రా ఇచ్చారు. చరిత్రను వక్రీకరిస్తే.. తెరలు చినిగిపోవడం ఖాయం అంటున్నారు. ఆ సంగతి పక్కన పెడితే..  ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి ఆలియా భట్ నటించనుంది. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. తన తర్వాత షెడ్యూల్‌ను పూణేలో నిర్ణయించింది. అయితే కారోనా కారణంగా ఆ షెడ్యూల్ వాయిదా పడింది. అది అలా ఉంటే ఈ సినిమాలో చరణ్ జోడి ఆలియా భట్.. ఇంతవరకు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో పాల్గొనలేదు. అయితే ఈ పూణే షెడ్యూల్‌లో ఆలియా ఆర్ ఆర్ ఆర్ టీమ్‌తో జాయిన్ కానుందని చిత్రబృందం చెప్పుకొచ్చింది.

RRR Update, Alia Bhatt news, rrr news,alia bhatt pics,rrr movie,rrr,alia bhatt about rrr movie,alia bhatt in rrr movie,alia bhatt in rrr,alia bhatt rrr,alia bhatt movies,rrr movie trailer,rrr movie updates,rrr movie teaser, rajamouli, ఆర్ఆర్ఆర్ ,ఆలియా భట్ ఔట్‌,ఆలియా భట్, రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఒలివియా మోరీస్
ఆర్ ఆర్ ఆర్ టీమ్ Photo : Twitter


ఇప్పటికే పలు కారణాలతో ఈ సినిమా షెడ్యూల్ వాయిదా పడుతూ వస్తోంది. దీనికి తోడు కరోనా లాక్ డౌన్ కూడా తోడవ్వడంతో ఆలియా ఇప్పటి వరకు టీంతో జాయిన్ కాలేదు. కాగా బాలీవుడ్ బిజీ నటీమణులలో ఆలియా భట్ ఒకరు. ఆమె చేతిలో ప్రస్తుతం అదిరిపోయే ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం ఆమె RRR సినిమాతో పాటు, గంగూబాయ్, బ్రహ్మస్త్రలో నటిస్తోంది. దీంతో ప్రతి ప్రాజెక్ట్‌కి పక్కా ప్లానింగ్‌తో డేట్స్ ఇచ్చిన ఆలియా భట్‌కి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టతరంగా మారిందని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఆమె ఈ సినిమాలో నటించడం కష్టం అన్నారు.

RRR Update, Alia Bhatt to quit rrr,alia bhatt,rrr movie,rrr,alia bhatt about rrr movie,alia bhatt in rrr movie,alia bhatt in rrr,alia bhatt rrr,alia bhatt movies,rrr movie trailer,rrr movie updates,rrr movie teaser,alia bhatt super comments on rajamouli and rrr movie,rajamouli about rrr movie,rrr teaser,alia bhatt about rajamouli,alia bhatt songs,rrr press meet,rrr movie songs,alia bhatt about rrr,aliaa bhatt about rrr,ఆర్ఆర్ఆర్ ,ఆలియా భట్ ఔట్‌,ఆలియా భట్, రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఒలివియా మోరీస్
ఆర్ ఆర్ ఆర్ టీమ్ Photo : Twitter


ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ నిలిచిపోవడంతో ఆమె ఇచ్చిన డేట్స్ అయిపోయాయట. దీంతో తరువాతి ప్రాజెక్ట్ లోకి వెళతానని, అందుకు అంగీకరించాలని రాజమౌళిని ఆలియా కోరినట్టు వార్తలు రాగా వాటిలో నిజం లేదని తెలుస్తోంది. ఆలియా ఆర్ ఆర్ ఆర్ కోసం నవంబర్ 2 నుంచి ఏకబిగిన డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది. దీంతో రాజమౌళి నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించి ముందుగా ఆలియా భట్ కాంబినేషన్‌లో వున్న సన్నివేశాలను ఈ షెడ్యూల్లోనే పూర్తి చేస్తాడట. ఇక ఇటీవల సుశాంత్ మృతి కేసులో ఆలియా భట్‌ను నెటిజన్స్ తీవ్రంగా ఆడిసోసుకున్నారు. సుశాంత్ మరణానికి ఆమె తండ్రి మహేష్ భట్  కూడా ఓ కారణమంటూ నెటిజన్స్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆలియా నెపోటిజం కారణంగానే సినిమాల్లో అవకాశాలు దక్కించుకుందని.. విమర్శించారు.

ఆలియా భట్ (Alia Bhatt RRR remuneration)
ఆలియా భట్ (Alia Bhatt RRR remuneration)


అంతేందుకు ఆ నేపథ్యంలోనే ఆలియా భట్ నటించిన సడక్ 2 ట్రైలర్ కు య్యూట్యూబ్ లో తీవ్ర అవమానం జరిగింది. ఆ ట్రైలర్ అత్యధిక సంఖ్యలో డిస్ లైక్ చేసిన ట్రైలర్‌గా నిలిచి రికార్డ్ సృష్టించింది. మరోవైపు ఆలియాను  ఆర్ఆర్ఆర్ నుంచి తొలిగించకపోతే.. బిహార్‌లో ఈ సినిమాను విడుదల కానీయబోమని సుశాంత్ అభిమానులు ఆల్రెడీ రాజమౌళికి వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి ఇటు కొమరం భీమ్ ఇష్యూతో పాటు అటు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తర్వాత ఆలియా భట్ ఇష్యూలను రాజమౌళి ఎలా హ్యాండిల్ చేస్తాడనేది చూడాలి.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 28, 2020, 10:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading